ఉపాధ్యాయునిగా మారిన కలెక్టర్



*ఉపాధ్యాయునిగా మారిన కలెక్టర్*



పార్వతీపురం/పాచిపెంట, నవంబరు 5 (ప్రజా అమరావతి): పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాచిపెంట మండలంలో శని వారం పర్యటించారు. పర్యటనలో భాగంగా పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, వంట ప్రదేశం, ఆహార పదార్థాలు, మరుగు దొడ్లు అన్ని పరిశీలించారు. తరగతి గదిలోకి వెళ్లారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు పరీక్షించారు. కాసేపు తన హోదాను మరచి ఉపాధ్యాయుడిగా మారారు. చాక్ పీస్, డస్టర్ తీసుకున్నారు. విద్యార్థుల గణిత, ఆంగ్ల ప్రమాణాలు పరీక్షించారు. తానే స్వయంగా బోర్డుపై రాస్తూ విద్యార్థులను అడిగారు. కొంత మంది విద్యార్థులను పిలిచి బోర్డుపై చిన్న లెక్కలు ఇచ్చి చేయమన్నారు. కొంత విద్యార్థులు తడబడ్డారు. గణిత, ఆంగ్ల బోధనలో ప్రత్యేక శ్రద్ద వహించాలని సంభందిత ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండాలని అనేక చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ ఉండరాదని ఆయన తెలిపారు. 


*ప్రభుత్వ భవనాలు వేగవంతం కావాలి*


ప్రభుత్వ భవనాలు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ అన్నారు. మండలంలో పద్మపురంలో జరుగుతున్న వివిధ భవనాల నిర్మాణాలను ఆయన తనిఖీ చేశారు. 


ఈ కార్యక్రమంలో మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments