రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
మన బడి నాడు నేడు పనులను పూర్తి చెయ్యడంలో విద్యా, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాల
ని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు.
శుక్రవారం సాయంత్రం సుధీర్ఘంగా జిల్లా, మండల స్థాయి అధికారులతో నాడు నేడు పనులపై మండల , స్కూల్ వారీగా క్యాంపు కార్యాలయం నుంచి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. డి ఈ ఓ ఎస్. అబ్రహం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలోని 15 జూనియర్ కాలేజి లను 10.79 కోట్ల తో, 675 పాఠశాలల్లో రూ.271 .97 కోట్లతో పనులు చేపట్టడం జరుగుతోందని అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠత్మకంగా నాడు నేడు పనులను చేపట్టడం తో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు ప్రతి గురువారం అంశాల వారీగా సమీక్ష చేస్తూ దిశా నిర్దేశనం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నాడు నేడు ఇంజనీరింగ్ పనులకు కావలసిన మెటీరియల్ ను ఆయా మండల పరిధిలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని, ఈ విషయంలో పనులు పూర్తి చెయ్యడం లో అధికారుల మధ్య సమన్వయం సాధించడం చాలా కీలకం అన్నారు. జిల్లాలో కొన్ని మండలాలు, స్కూల్స్ కేటాయించిన నిధులలో సమర్థవంతంగా అమలు చేయడం జరిగిందన్నారు. పెరవలి మండలంలో రూ.67.22 లక్షలకు గాను రూ.50.26 లక్షలు ఖర్చు చేసి జిల్లాలో ప్రదమస్థానం లో ఉండగా తదుపరి ఉండ్రాజవరం (183.67 లక్షలు కు రు.163.54 లక్షలు), బిక్కవోలు (రూ.189.01 లక్షలు కి ₹.163.97) ఉన్నాయన్నారు. అత్యంత తక్కువ ఖర్చు చేసిన వాటిలో రాజానగరం (₹.311.50 లక్షలు కి రు.206.08 లక్షలు), రాజమహేంద్రవరం రూరల్ (రూ.375.65 లక్షలు కి రూ.281.62 లక్షలు), కోరుకొండ ,(₹.393.23 లక్షలు కి 311..65 లక్షలు) ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే బుధవారం నాటికి ప్రగతి దిశగా అడుగులు వేయడం పై ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసుకొవాలని స్పష్టం చేశారు.
addComments
Post a Comment