కొడాలి నాని దుర్భాషలకు బదులు తీర్చుకుంటాం



 *- కొడాలి నాని దుర్భాషలకు బదులు తీర్చుకుంటాం


 *- గుడివాడ గెల్చుకుని చంద్రబాబుకు కానుకగా ఇస్తాం* *- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్*



విజయవాడ, నవంబర్ 4 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే కొడాలి నాని చేస్తున్న దుర్భాషలకు బదులు తీర్చుకుంటామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గాన్ని గెల్చుకుని చంద్రబాబుకు కానుకగా ఇస్తామని ఆయన మరోమారు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబుతో కలిసి శిష్ట్లా లోహిత్ విస్తృతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పదే పదే చంద్రబాబును, లోకేష్ ను ఇష్టానుసారంగా విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై దుర్భాషలాడడాన్ని గుడివాడ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, అతని కుమారుడు రాజేష్ అక్రమ అరెస్ట్ వ్యవహారంలో కూడా ఎమ్మెల్యే కొడాలి నాని వక్రభాష్యం చెబుతున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులను రాత్రి వేళల్లోనే అరెస్ట్ చేస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో మార్పు మొదలైందని చెప్పారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 2024 ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చివరి ఎన్నికలుగా అభివర్ణించారు. ఇదిలా ఉండగా ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎంతగానో కృషి చేసిందన్నారు. దేశంలో మొదటిసారిగా టీడీపీ హయాంలోనే మైనార్టీలకు కార్పోరేషన్ ఏర్పాటు జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీని తీసుకువచ్చారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ కర్నూల్ లో ఉర్దూ యూనివర్సిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను చంద్రబాబు ఇచ్చారన్నారు. దేశ చరిత్రలో ముస్లిం పెద్దలకు ఆర్థికసాయం చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమని అన్నారు. ఏటా 10వేల మంది ముస్లింలకు రుణ సదుపాయాన్ని కల్పించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం జరిగిందన్నారు. చంద్రబాబు హయాంలో అన్నివర్గాల సంక్షేమానికి కృషి జరిగిందని గుర్తుచేశారు. కాగా, ఇటీవల విజయవాడలో పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు సంఘీభావం ప్రకటించడంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయన్నారు. పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద అనుమానాస్పద వాహనాలు తిరగాయని, కొత్త వ్యక్తుల సంచారంపై అభిమానులు ఆందోళన చెందారన్నారు. ప్రభుత్వం స్పందించి దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద జరిగిన రెక్కీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించే విధంగా కొంత మంది వైసీపీ నేతలు మాట్లాడడం దురదృష్టకరమని శిష్ట్లా లోహిత్ అన్నారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image