రాష్ట్ర ముఖ్య మంత్రికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు : జెడ్ పి చైర్మన్



 *గంగాధర నెల్లూరు మండలం చిన్న వేపంజేరి పంచాయతీలో వివిధ ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన గౌ.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖామాత్యులు* 


*రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చే ఆరాధ్య దైవంగా రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి* 


 *దేవాలయాలతో సమానమైనవి మన ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు, ఆర్ బి కె లు, వెల్ నెస్ సెంటర్లు:*  


 *గౌ.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖామాత్యులు* 


 *రాష్ట్ర ముఖ్య మంత్రికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు : జెడ్ పి చైర్మన్* 


 *జి డి నెల్లూరు నియోజకవర్గంలో గత 40 సం. లలో లేని విధంగా అభి వృద్ధి జరుగుతు న్నది : ఆర్ టి సి కార్పొరేషన్ వైస్ చైర్మన్* 


 జి.డి.నెల్లూరు, నవంబర్ 02 (ప్రజా అమరావతి);


రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చే ఆరాధ్య దైవం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని గౌ.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖామాత్యులు కె. నారాయణ స్వామి తెలిపారు.


బుధవారం ఉదయం జి.డి.నెల్లూరు లోని చిన్న వేపంజరి పం చాయతీలో నూతన గ్రామ సచివాలయా లు, ఆర్ బి కె లు, వెల్ నెస్ సెంటర్లను జెడ్ పి చైర్మన్ గోవిం దప్ప శ్రీనివాసులు, ఆర్ టి సి కార్పొరే షన్ వైస్ చైర్మన్ విజయా నంద రెడ్డి లతో కలసి గౌ.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖామాత్యులు ప్రారంభించారు. 


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఆరాధ్య దైవంగా ఉంటూ వారి కష్టాలను తీరుస్తూ వారి అభివృద్ధికి పాటు పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు, ఆర్ బి కె లు, వెల్ నెస్ సెంటర్ లు ప్రజల కష్టాలను తీర్చే దేవాలయాలని తెలిపారు. ప్రజలు వారి సమస్యల పరిష్కారానికై రాజధానుల వరకు వెళ్ళవలసిన అవసరం లేకుండా సచివాలయాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా పరిష్కారం చూపడం జరుగుతున్నదని తెలిపారు. 


 *ఈ సందర్భంగా చిన్న వేపంజేరిలో రూ.21.80 లక్షలతో ఆర్ బి కె, రూ.17.50 లక్షలతో వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్, రూ. 40.00 లక్షలతో గ్రామ సచివాలయ భవనాలను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు.* 


జెడ్.పి చైర్మన్ మాట్లాడుతూ చిన్న వేపంజేరి పంచాయతీలో గ్రామ సచివాలయాలు, ఆర్బికె లు, వెల్ నెస్ సెంటర్లు ప్రారంభించడం జరుగుతున్నదని, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం లో నడిపిస్తున్నారని తెలిపారు. 

ఆర్ టి సి కార్పొరేషన్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో జి డి నెల్లూరు నియోజకవర్గంలో గత 40 సం. లలో లేని విధంగా రోడ్లు, ప్రభుత్వ భవనాలు వంటి వివిధ అంశాల్లో అభివృద్ధి జరుగుతున్నదన్నారు. 


డి ఎం అండ్ హెచ్ ఓ శ్రీ హరి మాట్లాడుతూ దేశం లో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతున్నదని తెలిపారు. ఇందులో భాగంగా గ్రామాలలో ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ వైద్యుదు వ్యక్తిగతంగా వెళ్లి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యం చేయడం జరుగుతుందన్నారు. మండలానికి రెండు పి హెచ్ సి లు ఉన్నాయని, ప్రతి గ్రామానికి ఒక వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని తెలిపారు. వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ లో ఒక ఎం ఎల్ హెచ్ పి, ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏ ఎన్ ఎం లు, ఆశా వర్కర్లు ఉంటారని దీని ద్వారా 14 రకాల వైద్య పరీక్షలు, 67 రకాల ఔషదాలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

ఈ కార్యక్రమం లో జెడ్ పి సి ఈ ఓ ప్రభా కర్ రెడ్డి, తహశీల్దార్ ఇన్బ నాథన్, ఎం పి డి ఓ శ్రీ దేవి,  ఎం పి పి అనిత లోకేష్ రెడ్డి, జెడ్ పి టి సి లక్ష్మి ప్రియ, ఎం పి టి సి రామచంద్రారెడ్డి, సర్పంచ్ ఝాన్సీ హేమ శేఖర్ రెడ్డి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Comments