దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ మన రాష్ట్రంలోనే ఉంటుంది


వంకాయలపాడు, పల్నాడు జిల్లా (ప్రజా అమరావతి);


*పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్ధ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*


అందరికీ స్వాగతం. వేలాదిమంది రైతులకు మేలు చేసే ఇంత మంచి పరిశ్రమ ఏర్పాటు చేసినందుకు ఐటీసీ బృందానికి అభినందనలు. ఐటీసీ లిమిటెడ్‌ ఛైర్మన్‌ సంజీవ్‌ పూరి, స్పైసెస్‌ బోర్డు సెక్రటరీ సతియాన్, నా కేబినెట్‌ సహచరులకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, అతిధులందరికీ అభినందనలు.*ఐటీసీ స్పైస్‌ ప్లాంట్‌ – వండర్‌పుల్‌ మూవ్‌మెంట్‌.*

 ఐటీసీ గ్లోబల్‌ స్పైస్‌ ప్లాంట్‌ ఇవాళ ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. దాదాపుగా రూ.200 కోట్ల పెట్టుబడి, ఏటా 20వేల మెట్రిక్‌ టన్నుల మిర్చితో పాటు మరో 15 రకాల సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా ప్రాసెస్‌ చేసి ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తారు. మిర్చితోపాటు అల్లం, పసుపు, ధనియాలు, యాలకులు వంటి 15 రకాల సేంద్రీయ సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్‌ చేస్తారు. ఈ ప్లాంట్‌ తొలిదశ పూర్తయింది. రెండో దశ కూడా మరో 15 నెలల్లో పూర్తవుతుందని చెబుతున్నారు. అది కూడా పూర్తయితే...  దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ మన రాష్ట్రంలోనే ఉంటుందని ఐటీసీ ఛైర్మన్‌ సంజీవ్‌ పూరి చెప్పారు. ఇప్పటికే 20వేల మెట్రిక్‌ టన్నుల ప్రాసెసింగ్‌ యూనిట్‌ పెడుతున్నారు.. దీనివల్ల దాదాపుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1500 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం జరుగుతుంది .అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న 14వేల మంది రైతులకు ఇది ఒక గొప్ప వరంగా ఉపయోగపడుతుంది. నవంబరు 2020లో ఈ ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభించారు. ఈ రోజు నవంబరు 2022 అంటే కేవలం 24 నెలల కాలంలోనే ఈ ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభించి, పనులు పూర్తి చేసారు. ఇంత వేగంగా అడుగులు పడ్డాయి అంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంత ఉందన్నదానికి వేరే నిదర్శనం అవసరం లేదు. 


*ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ – ఏపీ నెంబర్‌ వన్‌.*

ఇక్కడ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి మాట్లాడాలి. దీని నుంచి నేను మాట్లాడ్డం కన్నా... ఐటీసీ ఛైర్మన్‌ సంజీవ్‌ పూరి గారు ఆంధ్రప్రదేశ్‌లో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి గొప్పగా మాట్లాడారు. ఆయన నోట్లోంచిæ ఈ మాటలు రావడమే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి అధికారికి ఇదొక గొప్ప క్రెడిట్‌. 

గత మూడు సంవత్సరాల నుంచి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ స్ధానం ప్రతి సంవత్సరం తీసుకుంటుంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మొట్టమొదటిసారిగా గత మూడు సంవత్సరాలుగా .. పరిశ్రమలను పెట్టే వాళ్లని కూడా అభిప్రాయాలను అడిగి, వాటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కి సంబంధించిన మార్కులు ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ గడిచిన మూడు సంవత్సరాలుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా నెంబర్‌ వన్‌ స్ధానం తీసుకోవడం అంటే... ఇదొక గొప్ప మార్పు. గొప్ప సుగుణం. 


*రూ.3450 కోట్లతో 26 జిల్లాల్లో పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ....*

ఇటువంటి పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఇంకా ఎక్కువ రావాలని ఇప్పటికే కార్యాచరణ చేశాం. 26 జిల్లాలు ఏర్పాటు చేశాం.  ప్రతి జిల్లాలోనూ రైతులు స్ధానికంగా పండించే పంటలన్నింటికీ కూడా ఇంకా మెరుగైన ధర రావాలి, రైతులకు ఇంకా మెరుగైన పరిస్థితులు ఉండాలి, వాల్యూ ఎడిషన్‌ ద్వారా అది సాధ్యమవుతుందని 26 పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను రూ.3450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్‌ చేసింది. దీనివల్ల ప్రతి జిల్లాలో ఉన్న రైతులకు మేలు చేయడమే కాకుండా దాదాపు 33వేల ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతాం. 

ఇందులో ఫేజ్‌ –1 కు సంబంధించి 10 యూనిట్ల కోసం రూ.1250 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే కార్యక్రమాలు డిసెంబరు, జనవరిలో శంకుస్ధాపన చేయనున్నాం. ఇవన్నీ ఒక్కసారి పూర్తయితే, మరో రెండు మూడేళ్లలో ఈ 26 అందుబాటులోకి వస్తాయి. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా, రైతన్నలకు ఇది ఒక పెద్ద వరంగా మారనుంది. 


*రైతుల ఉత్పత్తులకు వాల్యూ ఎడిషన్‌....*

ఈ స్పైస్‌ ప్లాంట్‌కు సంబంధించిన ప్రొసీజర్‌ ఎలా ఉంటుందని విచారణ చేశాను. వీళ్ల ప్రొసీజర్‌ ఎలా ఉంటుంది, ఏమేం చేస్తారో కూడా విచారణ చేశాను. మెటీరియల్‌ వచ్చిన వెంటనే క్లీనింగ్, గ్రేడింగ్, డీస్టీమింగ్, గ్రైండింగ్, బ్లెండింగ్, స్టీమ్‌ స్టెరిలైజేషన్, ప్యాకింగ్‌ ఇటువంటి రకరకాల పద్ధతిలో ఈప్రాసెసింగ్‌ పూర్తిచేసుకుంటే రైతులు పండించిన పంటకు వాల్యూ ఎడిషన్‌ జరుగుతుంది. ఎక్స్‌పోర్ట్‌ మార్కెట్‌లో వీటి అమ్మకం కూడా సులభమవుతుందనే ఉద్ధేశ్యంతో ఈ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటువంటి ప్రాసెసింగ్‌ యూనిట్లు మన రాష్ట్రంలో రావడం వల్ల మన రైతులుకు కచ్చితంగా మేలు జరుగుతుంది. ఇన్ని వందల కోట్ల రూపాయిలతో పెట్టుబడితో ఇక్కడ ప్రాసెసింగ్‌ యూనిట్‌ పెట్టారు కాబట్టి.. మన రైతుల ఉత్పత్తులకు మెరుగైన రేటు ఇచ్చి.. మన రైతులను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమంలో ఐటీసీ ముందడుగు వేస్తుంది. 


ఇటువంటి గొప్ప మార్పులు వ్యవసాయరంగంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి గొప్ప మార్పుల్లో మొట్టమొదటి తొలి అడుగు మన ప్రభుత్వం రాగానే ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాల స్ధాపనతో పడింది. 

ప్రతి గ్రామంలో ఆర్బీకే స్ధాపన ద్వారా రాష్ట్రంలో దాదాపు 10,668 ఆర్బీకేల స్ధాపించాం. ప్రతి ఆర్బీకేలోనూ అగ్రికల్చర్‌ గ్యాడ్యుయేషన్‌ చదివిన ఒక అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ను నియమించి.. రైతును చేయిపట్టుకుని విత్తనం నుంచి విక్రయం వరకూ తోడుగా ఉండే గొప్ప మార్పును గ్రామాల్లో తీసుకొచ్చి, గొప్ప విప్లవం సృష్టించాం. 


*ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో– ప్రభుత్వం...*

ఐటీసీ సంస్ధ ఈ రాష్ట్రంలో ఇంకా మెరుగైన పరిస్థితుల్లోకి పోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఐటీసీకి అన్ని రకాల మద్ధతు ఇచ్చే విషయంలో వెనుకడుగు ఎప్పుడూ ఉండదని ఐటీసీ యాజమాన్యానికి తెలియజేస్తున్నాను. 

సంజీవ్‌ పూరి గారికి మరొక్క విషయం తెలియజేస్తున్నాను. 

 మీకు ఎప్పుడు ఏ సమస్య  వచ్చినా కూడా... రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉంటుంది. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొండి.  మీ కష్టాన్ని మా కష్టంగా భావించి.. సాధ్యమైనంత వేగంగా దాన్ని పరిష్కరిస్తాం. ఇది మా మాట. ఇంత మంచి ప్రాజెక్టు ఏర్పాటు చేసినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదములు తెలియజేస్తున్నాను అని  సీఎం తన ప్రసంగం ముగించారు. 


ఈ కార్యక్రమంలో  జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఐటీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image