*స్పందనకు 133 వినతులు*
విజయనగరం, డిసెంబర్ 19 (ప్రజా అమరావతి):- జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన వినతుల కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి 133 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి అత్యధికంగా 76 ఉన్నాయి. పింఛన్ల కోసం, రేషన్ కార్డుల జారీ, ఉపాధి కల్పన, ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు ఇతర సమస్యలపై మిగిలిన వినతులు అందాయి. జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ప్రత్యేక ఉప కలెక్టర్లు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
addComments
Post a Comment