*పరివర్తన 2.0 కింద 79 కుటుంబాలకు ఆర్థిక సాయం
*
@రూ.43.31 లక్షల రుణ చెక్కును అందజేసిన కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, డిసెంబర్ 19 (ప్రజా అమరావతి):- అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పరివర్తన 2.0 కార్యక్రమంలో భాగంగా జీవనోపాధి నిమిత్తం 79 కుటుంబాలకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందింది. ఈ మేరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో సమకూర్చిన రూ.43.31 లక్షల విలువ గల చెక్కును పాత ఆబ్కారీ నేరస్థులకు జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి సోమవారం అందజేశారు. స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో సెర్బ్, ఎక్సైజ్, డి.ఆర్.డి.ఎ, సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పరివర్తన 2.0 కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా సారాయి, ఇతర మత్తు పానీయాలు తయారు చేసే వారి సాధారణ జీవితంలోకి రావాలని అవగాహన కల్పించారు. మొత్తం 121 మందిని గుర్తించి వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపుతూ వివిధ శాఖలు రుణ సదుపాయం కల్పించాయి. సంబంధిత చెక్కును అందజేసిన కలెక్టర్ మాట్లాడుతూ రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని మెరుగైన జీవనోపాధి పొందాలని సూచించారు.
కార్యక్రమంలో సెర్బ్ ఏఎస్పీ ఆస్మా పర్హీన్, డి.ఎస్.పి. శైలజా రాణి, డి.ఆర్.డి.ఎ. పీడీ కళ్యాణ్ చక్రవర్తి, పశు సంవర్థక జేడి రమణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment