కొత్తగా 2,983 కొత్తరేషను కార్డులు/కుటుంబ విభజన కార్డులు మంజూరు : జాయింట్ కలెక్టర్ టి.ఎస్.చేతన్

 *కొత్తగా 2,983 కొత్తరేషను కార్డులు/కుటుంబ విభజన కార్డులు మంజూరు : జాయింట్ కలెక్టర్ టి.ఎస్.చేతన్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), డిసెంబర్ 24 (ప్రజా అమరావతి):


శ్రీ సత్య సాయి జిల్లాకు సంభందించి 2,983 కొత్తరేషను కార్డులు/కుటుంబ విభజన కార్డులు మంజూరు అయ్యాయని జాయింట్ కలెక్టర్ టి.ఎస్.చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. సదరు రేషను కార్డులను కార్డుదారులు సంభందిత విఆర్ఓ/ గ్రామ వాలెంటరీలను సంప్రదించి ఆదివారం సాయంత్రములోగా అతెంటికేషన్ వేసి తీసుకోవాలన్నారు. అలా తీసుకున్నప్పుడు మాత్రమే జనవరి నెలకి సంభందించిన నిత్యావసర సరుకుల కేటాయింపు జరుగుతుందన్నారు. కావున సంభందిత విఆర్ఓ/ గ్రామ వాలెంటరీలు కొత్త రేషనుకార్డులను కార్డుదారులకు ఈ నెల 25వ తేది సాయంత్రంలోపు అందేలా తప్పని సరిగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని చౌకధాన్యపు డిపో డీలర్లు అందరూ జనవరి 2023 మాసమునకు సంభందించి కందిపప్పు మరియు చక్కెరకు 100 శాతం కేటాయింపుకు 26-12-2022 లోగా డిడిలు చెల్లించి అదేరోజునే సంభందిత ఎంఎల్ఎస్ పాయింట్లలో అందజేయాలన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులు 29-12-2022 తేదీ నాటికి అన్ని చౌక ధాన్యపు డిపోలకు పూర్తిగా నిత్యావసర సరుకుల లిఫ్టింగ్ చేయించాలన్నారు. ప్రతి కార్డుదారుడు ఖచ్చితంగా జనవరి మాసములో అతెంటికేషన్ వేసి బియ్యంతోపాటు చక్కెర కిలో రూ.17 లు మరియు 1కేజీ కందిపప్పు రూ.67ల ప్రకారం తీసుకోవాలన్నారు.



Comments