అమరావతి (ప్రజా అమరావతి)
*8 వ తరగతి విద్యార్ధులు, టీచర్లకు ఉచితంగా ట్యాబ్‌లు*
*రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8 వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్ధులు, బోధించే 59,176 మంది ఉపాధ్యాయులకు రూ. 778 కోట్ల బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌తో రూ. 686 కోట్ల విలువైన 5,18,740 శామ్సంగ్ ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ, మొత్తం రూ. 1,464 కోట్ల లబ్ధి*
*రేపు (21.12.2022) బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్*
*రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు పంపిణీ కార్యక్రమాలు*
*ఇంగ్లీష్ మీడియం తీసుకువస్తూ, క్లాస్‌రూమ్‌లో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తెస్తూ, క్లాస్ బయట కూడా 24/7 విద్యార్ధులు సబ్జెక్ట్‌ను నేర్చుకోవడానికి వీలు కల్పిస్తూ, కేవలం స్ధితిమంతుల పిల్లలకే అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని పేద పిల్లలకు ఒక మంచి మేనమామలా అందిస్తూ వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తూ శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న కానుక*
*పేద విద్యార్ధులను గ్లోబల్ సిటిజెన్లుగా తీర్చిదిద్దేలా, డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్ధమయ్యేలా...మెరుగైన చదువుల దిశగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8 వ తరగతిలోకి అడుగుపెట్టిన పిమ్మట ప్రతి విద్యార్ధికి ఇకపై ప్రతి ఏటా బైజూస్ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌ల పంపిణీ, ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం*
*4 నుండి 10 వ తరగతి చదువుతున్న 32 లక్షల మంది విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ. 15,500 విలువైన రూ. 4,960 కోట్ల బైజూస్ కంటెంట్ ఉచితం*.
*రూ. 16,500 కు పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్, దాదాపు రూ. 15,500 విలువ గల కంటెంట్‌తో కలిపి ప్రతి 8 వ తరగతి విద్యార్ధికి రూ. 32 వేల లబ్ధి*
*ప్రస్తుతం 8 వ తరగతి చదువుతున్న విద్యార్ధులు 2025 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ విధానంలో ఇంగ్లీష్ మీడియంలో 10 వ తరగతి పరీక్ష రాసేలా పిల్లలను సన్నద్ధం చేస్తున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం*
*శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌తో అందిస్తున్న ట్యాబ్ ప్రత్యేకతలు*
– పేద విద్యార్ధులకు సైతం డిజిటల్ విద్యను అందుబాటులోకి తెస్తూ, తరగతి గదుల్లో చెప్పే పాఠాలను ఇళ్ళకు వెళ్ళాక కూడా పిల్లలు మరింత క్షుణ్ణంగా నేర్చుకునేందుకు వీలుగా బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ
– ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్ధులకు ఆఫ్ లైన్లో కూడా ఎక్కడైనా, ఎప్పుడైనా 24/7 పాఠ్యాంశాలు అందుబాటులో ఉండేలా, 8,9 తరగతుల కంటెంట్ మెమరీ కార్డు ద్వారా ట్యాబ్‌లలో ప్రీలోడ్
– బైజూస్ ప్రీమియం యాప్ ద్వారా విద్యార్ధులకు మాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియాలజీ, సివిక్స్ సబ్జెక్ట్‌లలో అభ్యసన సులువుగా ఉండేలా ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఉచిత ఈ–కంటెంట్. ప్రతి చాప్టర్‌ను కాన్సెప్ట్‌లుగా విభజించి 67 చాప్టర్లు, 472 కాన్సెప్ట్లపై 300 వీడియోలు, 168 సాల్వ్డ్ క్వశ్చన్ బ్యాంక్‌లు అందుబాటులో
– పిల్లలకు సులభంగా పాఠ్యాంశాలు అర్ధమయ్యేలా టెక్ట్స్ రూపంలో మాత్రమే కాకుండా మంచి చిత్రాలు, వీడియో, ఆడియో, త్రీ డైమెన్షన్ (త్రీడీ) ఫార్ములాలో యానిమేషన్లతో రూపొందించిన కంటెంట్
– పిల్లలు తమ స్ధాయిని స్వయంగా అంచనా వేసుకునేలా అసెస్మెంట్ విధానం, ప్రతి చాప్టర్ తర్వాత 40–50 ప్రశ్నలు, వివిధ గ్రేడ్లలో మాక్ పరీక్షలు
– ట్యాబ్‌లలో అవాంఛనీయ సైట్లు, యాప్స్‌ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్ వేర్, 3 ఏళ్ళ పాటు వారంటీ, ఏదైనా సమస్య తలెత్తితే సమీపంలోని సచివాలయాల్లో ఇవ్వండి, ఒక వారంలో వారు రిపేర్ చేసైనా ఇస్తారు లేదా మార్చి వేరేదైనా ఇస్తారు, బాధ్యత సచివాలయాలదే
– ఈ జూన్ కల్లా నాడు – నేడు ఫేజ్ 1 లో పూర్తయిన 15,634 స్కూల్స్‌లోని 6 వ తరగతి పైన 30,032 క్లాస్ రూమ్స్‌లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (డిజిటల్ డిస్ప్లే బోర్డుల ద్వారా చదువులు), ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్ళలో స్మార్ట్ టీవీల ఏర్పాటు దిశగా అడుగులు.
*అర్హులందరికీ క్రమం తప్పకుండా కుల, మత, పార్టీ వివక్ష లేకుండా, లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా పథకాలు అందిస్తూ విద్యారంగంలో కేవలం సంస్కరణలపై మాత్రమే శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం గత మూడున్నర ఏళ్ళలో చేసిన వ్యయం రూ. 54,910.88 కోట్లు*.
జగనన్న అమ్మ ఒడి పథకం లబ్ధిదారుల సంఖ్య 44,48,865 అందించిన మొత్తం రూ. కోట్లలో 19,617.53
జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారుల సంఖ్య 24,74,544 అందించిన మొత్తం రూ. కోట్లలో 9,051.57
జగనన్న వసతి దీవెన పథకం లబ్ధిదారుల సంఖ్య 18,77,863 అందించిన మొత్తం రూ. కోట్లలో 3,349.57
జగనన్న విద్యా కానుక పథకం లబ్ధిదారుల సంఖ్య 47,32,065 అందించిన మొత్తం రూ. కోట్లలో 2,368.33
8 వ తరగతి విద్యార్ధులు, టీచర్లకు ట్యాబ్‌లు (ఈ డిసెంబర్లో పంపిణీ, ఇకపై ప్రతి ఏటా 8 వ తరగతిలోకి వచ్చే విద్యార్ధులకు) పథకం లబ్ధిదారుల సంఖ్య 5,18,740 అందించిన మొత్తం రూ. కోట్లలో 688.00
జగనన్న గోరుముద్ద పథకం లబ్ధిదారుల సంఖ్య 43,26,782 అందించిన మొత్తం రూ. కోట్లలో 3,239.43
పాఠశాలల్లో నాడు నేడు మొదటి దశ 15,715 స్కూల్స్ అందించిన మొత్తం రూ. కోట్లలో 3,669.00
పాఠశాలల్లో నాడు నేడు రెండో దశ 22,344 విద్యాసంస్ధలు, అందించిన మొత్తం రూ. కోట్లలో 8,000.00
మూడు దశల్లో రూ. 16,450 కోట్ల వ్యయంతో మొత్తం 56,572 విద్యాసంస్ధల్లో అభివృద్ది పనులు
వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకం లబ్ధిదారుల సంఖ్య 34,19,875 అందించిన మొత్తం రూ. కోట్లలో 4,895.45
స్వేచ్ఛ (శానిటరీ నాప్కిన్స్) పథకం లబ్ధిదారుల సంఖ్య 10,01,860 అందించిన మొత్తం రూ. కోట్లలో 32.00
మొత్తం రూ. 54,910.88 కోట్లు.
addComments
Post a Comment