మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలి



మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలి


,హన్మకొండ జిల్లా కి పివి నామకరణం చెయ్యాలి

పివి వర్ధంతి వేడుకలు సందర్భంగా ఘన నివాళి అర్పించిన

- సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు


సిద్దిపేట జిల్లా: డిసెంబర్23. (ప్రజా అమరావతి);(హుస్నాబాద్ నియోజకవర్గం / అక్కన్నపేట మండలం) బారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు 18వ, వర్ధంతి వేడుకలు అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామ పంచాయతీ ఆవరణలో సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. పివి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బారత దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని, హన్మకొండ జిల్లా కి పివి నామకరణం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అదేవిధంగా జాతి గర్వించదగ్గ గొప్ప నాయుకుడు పివి దేశానికి నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి తీవ్ర ఆర్థిక సంక్షోభం నుండి గట్టేంకిచ్చిన అపర ఛానీఖ్యుడు పివి నరసింహ రావ్ తొమ్మిది జాతీయ ఇతర భాషల్లో అనర్గళంగా మాట్లాడే బహుభాషా కోవిదుడు బారతదేశం ప్రపంచ పటంలో గొప్ప దేశంగా చూపించిన ప్రపంచ మేధావి ఏందరికో స్ఫూర్తి ప్రధాత అని రాజు అభివర్ణించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో పీవీ నరసింహారావు ఘాట్ లేకపోవడం అత్యంత బాధాకరమని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు వారు అంటే ప్రత్యేక గౌరవ ప్రఖ్యాతులు తెచ్చిన మహనీయునికి మిగతా ప్రధానుల మాదిరిగా ఘాట్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వంకు రాజు విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు, గోవర్ధనగిరి ఉప సర్పంచ్ గొర్ల రాజు యాదవ్, కార్యదర్శి, పెండల బాలకృష్ణ, ఐలయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Comments