భారత రాష్ట్రపతి వారికి ఘన స్వాగతం.
తిరుపతి, డిసెంబర్04 (ప్రజా అమరావతి): రాష్ట్ర పర్యటనలో భాగంగా తిరుపతి తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొనుటకు రాత్రి 9.05 గం. లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారికి ఘన స్వాగతం లభించింది.
గౌ. ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదాలో శ్రీ కె. నారాయణ స్వామి , రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ, దేవాదాయ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిల్ కుమార్ సింఘాల్ (సి ఎస్ ప్రతినిధి), డా.రవిశంకర్ ఏపీ అదనపు డిజిపి శాంతి భద్రతలు మంగళగిరి ( DGP ప్రతినిధి), జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, తిరుపతి ఎస్పీ ఎస్. పరమేశ్వర్ రెడ్డి , మాజీ టీటీడీ బోర్డు మెంబర్ జి .భాను ప్రకాష్ రెడ్డి గౌ భారత రాష్ట్రపతి కి స్వాగతం పలికారు.
గౌ. యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ మరియు టూరిజం, డిఓఎన్ఈఆర్ జి.కిషన్ రెడ్డి గౌ.భారత రాష్ట్రపతి వారితో పాటుగా వచ్చి తిరుపతి జిల్లా పర్యటనలో పాల్గొననున్నారు.
అనంతరం వీరు తిరుమలకు బయలుదేరి వెళ్లారు.
addComments
Post a Comment