క్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం.

 క్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం.         


                               గుంటూరు (ప్రజా అమరావతి);

SUPRAMASSIVE SPLENOMEGALY (బల్ల) అనే వ్యాధితో బాధపడుతున్న 17 సంవత్సరాల యువకుడికి రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం -“ LAPAROSCOPIC SUPRAMASSIVE SPLENECTOMY.” అనే శస్త్ర చికిత్సను చిన్న కోతతో పూర్తి లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా ఈ  శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం జరిగింది, ఈ యువకుడికి గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ మరియు Pulmonary balloon valvaotomy — అనే అరుదైన శాస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగింది, Splenomegaly (బల్ల) అనేది కొన్ని వ్యాధులలో కన్పించే లక్షణం. నిజానికి ఇది ప్లీహం (Spleen) యొక్క పరిమాణంలో పెద్దది కావడం వలన తెలుస్తుంది. సామాన్యంగా ప్లీహం కడుపులో ఎడమవైపు ఉదరవితానం క్రింద ఉంటుంది. చాలా రకాల వ్యాధులలో ప్లీహం పెద్దదౌతుంది. ఏవైనా రక్త కణాలు ఎక్కువగా వృద్ధిచెందినప్పుడు వాటిని నిర్మూలించడానికి ప్లీహం కూడా పెద్దదిగా మారవలసి వుంటుంది. అలాంటప్పుడు దీనిని ఆయా వ్యాధుల లక్షణంగా భావిస్తారు. ఈ ప్లీహం అనేది సాధారణంగా 135 నుండి 175 గ్రాముల బరువు ఉంటుంది, ఈ యువకుడిలో ప్లీహం అనేది దానికి 12 రెట్లుగా అనగా 1710 గ్రాములు గా ఉంది.ఈ  పరిమాణంలో పెద్దదై ఎక్కువగా పనిచేసినప్పుడు దానిని హైపర్ స్ప్లీనిజం (Hypersplenism) అంటారు.  ఇందులో రక్తంలోని ఒకటి లేదా ఎక్కువ కణాలు తగ్గిపోతాయి, ఈ యువకుడిలో తెల్ల రక్త కణాలు WBC 2000, PLATELETS 79000, HEMOGLOBIN 7grms గా ఉంది దీనిని సరిచేయడానికి ప్లీహాన్ని తొలగించవలసి వుంటుంది.ఈ శస్త్రచికిత్సను స్ప్లీనెక్టమీ (Splenectomy) అంటారు. ఈ ఇబ్బందితో ఆ యువకుడు హైదరాబాద్ మరియు విజయవాడలో ప్రముఖ హాస్పిటల్స్ నందు చికిత్స తీసుకొనగా వారు లాప్రోస్కోపిక్ కుదరదు అని ఓపెన్ మాత్రమే చేయడానికి వీలవుతుందని చెప్పారని ఆ యువకుడు చెప్పడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో రమేష్ హాస్పిటల్స్ జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బడిపాటి రాజు, డాక్టర్  శ్రీకర్ ఇనుగంటి ఇంటర్వెషనల్ రేడియాలజిస్ట్, డాక్టర్ బికాస్ సాహు మత్తు వైద్య నిపుణులు , రమేష్ హాస్పిటల్స్ బిజినెస్ హెడ్ డాక్టర్ వై కార్తీక్ చౌదరి, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ భార్గవి   వైద్య బృందం పాల్గొని రోగి యొక్క వివరాలను తెలపడం జరిగింది. 


డిప్యూటీ మేనజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత వైద్య బృందాన్ని అభినందించారు.

Comments