జిల్లా జగనన్న భూ రక్ష.. భూ హక్కు సర్వే పనులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 



జిల్లా జగనన్న భూ రక్ష.. భూ హక్కు సర్వే పనులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. 



బుధవారం ఉండ్రాజవరం మండలం

సత్యవాడ గ్రామంలో పీఏల్ఆర్ సర్వే ప్రక్రియను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో 272 రెవెన్యూ గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటి వరకు 44 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. మిగిలిన 228 గ్రామాల్లో తదుపరి దశలో సర్వే ప్రక్రియను ప్రారంభించడం జరుగుతోందని తెలిపారు. ఈరోజు సత్యవాడ గ్రామంలో క్షేత్ర స్థాయి లో జరుగుతున్న సర్వే పనుల పురోగతి ని పరిశీలన కోసం రావడం జరిగిందన్నారు. గతంలో సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి, వాటిని ఎలా అధిగమించ గలిగాం వాటి దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం సజావుగా సర్వే ప్రక్రియ దిశగా అడుగులు వేయడం జరుగుతున్నట్లు తెలిపారు. తదుపరి ఆయా గ్రామాల్లో గ్రౌండ్ టు థింగ్, గ్రౌండ్ వాల్యుడేషన్, తదితర ప్రక్రియలను వేగవంతం చేస్తామని తెలిపారు. సమగ్ర రీసర్వే పూర్తయిన వెంటనే భూముల ఇన్‌వర్డ్/గ్రామ సచివాలయం రిజిస్ట్రేషన్ సర్వే పూర్తయిన తర్వాత భూ యజమానికి క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ టైటిల్ కార్డులు అందచేయ్యాడం జరుగుతుందని ఆయన అన్నారు.


జేసీ వెంట ఆర్డీవో ఎస్. మల్లి బాబు, జిల్లా సర్వే అధికారి పి. లక్ష్మణ రావు , ఉండ్రాజవరం మండలం తహశీల్దార్ జి. కనకరాజు, సర్వే, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments