శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,

 

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి):

    ఈరోజు బ్రాహ్మణ వీధి, జమ్మిదొడ్డి లోని మీటింగ్ హాలు నందు 2023 సంవత్సరపు ఆలయ క్యాలండర్ ను గౌరవనీయులైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయశాఖ మంత్రివర్యులు అయిన శ్రీ కొట్టు సత్యనారాయణ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు, దేవాదాయశాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ గారు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు శ్రీ కె. వి. ఎస్ కోటేశ్వరా రావు గారు, శ్రీమతి ఎల్. రమాదేవి గారు, సహాయ కార్యనిర్వాహనాధికారి శ్రీ బి. వెంకటరెడ్డి గారు మరియు ఇతరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రివర్యుల వారు ఆలయ మాస్టర్ ప్లాన్ పనుల గురించి మీడియా నుద్దేశించి మాట్లాడారు.

Comments