ద్వైవార్షిక నవరత్నాల సంక్షేమ పథకాల మంజూరు కు సంబంధించి ప్రజా స్పందన

 *ద్వైవార్షిక నవరత్నాల సంక్షేమ పథకాల మంజూరు కు సంబంధించి ప్రజా స్పందన


*


*1. నాకు ఇల్లు మంజూరు కావడం సంతోషం: రాధిక, శాతంబాకం, పెనుమూరు మండలం*


         నేను నా భర్త కూలి పనులు చేసుకుని జీవిస్తున్నామని, మాకు ఇంత వరకు ఉండడానికి ఇల్లు లేదని, వచ్చే సంపాదన కుటుంబ పోషణకే కష్టంగా కలదని, అలాంటిది మా జీవితంలో భూమి కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకుంటామని అనుకోలేదని, జగనన్న పుణ్యాన మాకు శాతంబాకం లేఅవుట్ నందు 1.5 సెంట్ భూమి కేటాయించి ఇంటి పట్టా ఇచ్చారని, గతంలో పట్టా రానందుకు బాధ పడ్డానని, అర్హత ఉండి రాని వారికి సంవత్సరం లో రెండు దఫాలుగా ముఖ్యమంత్రి పథకాల లబ్ధిని అందించడం మా లాంటి ఎంతో మంది పేదవారికి ఉపయోగకరంగా కలదని, ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని, మా కుటుంబానికి ఇంటి పట్టానే కాకుండా నా కొడుక్కి అమ్మఒడి కూడా అందుతున్నదని, శ్రీ సాయి చరణ్ స్వయం సహాయక సంఘ సభ్యురాలిగా ఆసరా, సున్నా వడ్డీ పొందానని, నా భర్తకు రైతు భరోసా క్రింద లబ్ది చేకూరుతున్నదని, ఇలా మా కుటుంబంలో ప్రభుత్వ పథకాల లబ్దితో అభివృద్ధి చెందుతున్నామని, సంతోషం వ్యక్తం చేసారు రాధిక.  


*2. జగనన్న విద్యా దీవెనతో ఆర్ధిక భారం తగ్గింది : స్టాన్లీ, బి.ఎస్సీ ఫైనల్ ఇయర్, దాసరపల్లి, యాదమర్రి మండలం* 


          జగనన్న విద్యా దీవెన క్రింద లబ్ది పొందేందుకు అర్హత ఉండి, గతంలో లబ్ది చేకూరకపోవడంతో ద్వైవార్షిక నవరత్నాల పథకాల లబ్దిలో భాగంగా నాకు జగనన్న విద్యా దీవెన మంజూరు కావడంతో నా కుటుంబానికి కొంత మేర ఆర్ధిక భారం తగ్గిందని, ఇందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి యువతకు విద్యతో పాటు నైపుణ్యాలు ఉన్నప్పుడే తగిన ఉపాధి పొందగాలరనే ఉద్దేశ్యంతో నియోజకవర్గానికి స్కిల్ కాలేజీ లను ఏర్పాటు చేయడం విద్యాభ్యాసం పూర్తి అయిన వెంటనే ఉపాధి అవకాశాలు పొందేందుకు సులువుగా ఉంటుందని ఇలాంటి మంచి ఆలోచనలతో అనేక సంక్షేమ పతకాలను ప్రవేశ పెడుతున్న ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. మా కుటుంబంలో నాకు విద్యా దీవెన పథకంతో పాటు మా అమ్మకు వై.యస్.ఆర్ ఆసరా, సున్నావడ్డీ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నామని తెలిపారు.


*3. వై.యస్.ఆర్ చేయూత మా కుటుంబానికి చేయూతనిస్తోంది : జీవా, కుచ్చంపల్లి, యాదమర్రి మండలం* 


          నా భర్త పెయింటింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తాడని, ఆ వచ్చే సంపాదనతో కుటుంబ పోషణ ఇబ్బంది కావడం తో నేను కిరాణా షాపు నడుపుతున్నానని, వై.యస్.ఆర్ చేయూత క్రింద లబ్ది పొందడంతో నా షాపును మరింత అభివృద్ధి చేసుకోవడం జరుగుతున్నదని, లక్ష్మి సరస్వతి గ్రూపు నందు సంఘ సభ్యురాలిగా బ్యాంక్ లింకేజి, ఆసరా, సున్నా వడ్డీ పథకాల లబ్ది పొందానని, అన్ని వర్గాల సంక్షేమానికి అవసరమైన పథకాలను అమలు చేస్తూ అందరి గురించి ఆలోచిస్తున్న జగనన్న పాలన బాగున్నదని సంతోషం వ్యక్తం చేసారు జీవా.


*4. ఇంటి వద్దకే ఫించన్: మీనా, యాదమర్రి మండలం*


           నా భర్త చనిపోయిన అనంతరం వితంతు పించన్ నాకు అందుతున్నదని, ఒకటవ తారీఖునే పించన్ ను వాలంటీర్ ఇంటి వద్దకే వచ్చి అందిస్తున్నారని, పించన్ తో పాటు వై.యస్.ఆర్ ఆసరా క్రింద పొందిన లబ్ది తో ఆవును కొనుగోలు చేసి పాలు అమ్మడం ద్వారా జీవనాధారంగా ఏర్పరచుకున్నానని, సంఘంలో సభ్యురాలిగా ఆసరా, సున్నావడ్డీ లబ్ది పొందానని, ఆర్థికంగా ఒకరి పై ఆధార పడే పని లేకుండా చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు మీనా.

Comments