కోవిడ్ ఎదుర్కొనుటకు సర్వం సన్నద్ధం*కోవిడ్ ఎదుర్కొనుటకు సర్వం సన్నద్ధంపార్వతీపురం, డిసెంబరు 27 :(ప్రజా అమరావతి) కోవిడ్ ను ఎదుర్కోవడానికి పార్వతీపురం మన్యం జిల్లా సర్వం సిద్దంగా ఉంది. ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పార్వతీపురం జిల్లా  ఆసుపత్రిలో  తనిఖీ చేశారు. జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ మక్కువ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోను, పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్ చినమేరంగి, సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి.నవ్య సీతంపేట, పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ పాలకొండ, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత సాలూరు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు పెద బొండపల్లి, బందలుప్పి., ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు మంగళ వారం మాక్ డ్రిల్ లో భాగంగా పరిశీలించారు. జిల్లాలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ఇప్పటికే చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం జిల్లాలో కోవిడ్ చికిత్స పరికరాలను సిద్ధం చేసి ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనుటకు అన్ని వర్గాలను సిద్ధం చేస్తున్నారు. 


జిల్లాలో కేంద్రంలో జిల్లా ఆసుపత్రితో సహా సాలూరు, పాలకొండ లలో ఏరియా ఆసుపత్రిలు, సీతంపేట, కురుపాం, చినమేరంగి, భద్రగిరి సామాజిక ఆసుపత్రులు రిఫరల్ ఆసుపత్రులుగా నిర్ణయించారు. 


జిల్లాలో మొత్తం ఫంక్షనల్ ఆక్సిజన్ సపోర్టేడ్ ఐసోలేషన్ బెడ్ల సంఖ్య: 128

ఫంక్షనల్ ఐసియు పడకలు: 8

వెంటిలేటర్ పడకలు : 50

అందుబాటులో ఉన్న మొత్తం అంబులెన్స్ లు : 12

నెబ్యులైజర్లు : 18

ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు : 112

ఆక్సిజన్ సిలిండర్ల సంఖ్య: 614

ఫంక్షనల్ పి.ఎస్. ఏ (Psa) ప్లాంట్ ల సంఖ్య : 2

అన్ని ఆసుపత్రుల్లో తగినంత వైద్య గ్యాస్ పైప్లైన్ వ్యవస్థలు ఉన్నవి. మందులు అందుబాటులో ఉన్నాయి. 

జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటుతో పాటు ఆసుపత్రుల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటుకు సిద్దం చేశారు. జిల్లా ఆసుపత్రిలో మంగళ వారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అవసరమగు అన్ని పరికరాలను తనిఖీ చేశారు. స్వయంగా పల్స్ ఆక్సిమీటర్ తో పల్స్ పరీక్షించుకున్నారు. సాధారణ రోగులు, కోవిడ్ రోగులకు వేరు వేరుగా చికిత్స అందించుటకు, గర్భిణీలు, అత్యవసర శస్త్ర చికిత్సల అవకాశాలు పరిశీలించారు.  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జగన్నాథ రావు, రాష్ట్రీయ బాల స్వస్త్యా కార్యక్రమం ప్రాజెక్ట్ అధికారి డా.ధవళ భాస్కరరావుతో కలిసి బందలుప్పి, పెద బొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ సంసిద్ధతను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది కోవిడ్ సేవలు అందించుటకు సిద్దంగా ఉన్నారు. 


జిల్లాలో కోవిడ్ వ్యాప్తి కాకుండా ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కోరారు. రద్దీ ప్రదేశాలకు వెళ్ళ వద్దని, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేయడం, మాస్కు ధరించడం పట్ల శ్రద్ద వహించాలని సూచించారు.

Comments