కందుకూరులో జరిగిన దుర్ఘటన దురదృష్టకరమని మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉండి ఆదుకుంటుంది




నెల్లూరు డిసెంబరు 30 (ప్రజా అమరావతి);


ఈనెల 28వ తేదీన కందుకూరులో జరిగిన దుర్ఘటన దురదృష్టకరమని మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉండి ఆదుకుంటుంద


ని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు


ఈ నెల 28 వ తేదీ  కందుకూరు లో జరిగిన దుర్ఘటనలో కందుకూరు మండలం కొండముడుసు పాలెం గ్రామానికి చెందిన కలవకూరి యానాది, ఓగూరు గ్రామానికి చెందిన గద్ద మధుబాబు, కందుకూరు పట్టణం గుర్రం వారి పాలెంకు చెందిన కాకుమారి నాగరాజా , ఉలవపాడు మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన దేవినేని రవీంద్రబాబు, ఉలవపాడు గ్రామానికి చెందిన యాటగిరి విజయ,  గుడ్లూరు మండలం గుండ్లపాలెం గ్రామానికి చెందిన ఉచ్చులూరు పురుషోత్తం, అమ్మవారిపాలెం గ్రామానికి చెందిన మర్లపాటి చిన్న కొండయ్య మృతి చెందినవారిలో వున్నారు.  వారి   కుటుంబ సభ్యులకు కందుకూరు సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో  శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్  శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు, కందుకూరు శాసనసభ్యులు శ్రీ మానుగుంట మహీదర్ రెడ్డితో కలిసి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున 8 మందికి  రాష్ట్ర ప్రభుత్వం తరఫున బ్యాంక్ చెక్కులను అందజేశారు.


. ఈ సందర్భంగా మంత్రివర్యులు మీడియాతో  మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన కందుకూరులో జరిగిన దుర్ఘటనలో 8 మంది మృత్యువాత  పడ్డారన్నారు


వారి కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారన్నారు.


దుర్ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి అధికారులను, స్థానిక శాసనసభ్యులను అప్రమత్తం చేసి బాధితులకు సహాయ సహకారాలు అందజేయాలని క్షతగాత్రులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని సూచించారన్నారు.


 కుటుంబ సభ్యులను కోల్పోయి శోకసముద్రంలో ఉన్న వారిని పలకరించి  ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పామన్నారు. 


వారి మానసిక స్థితిని అర్థం చేసుకొని

అంత్యక్రియలు పూర్తయిన తర్వాత నేడు  ఆర్థిక సహాయాన్ని అందజేశామన్నారు. 


మృతి చెందిన వారికి ఆత్మ శాంతి కలగాలని, కుటుంబ సభ్యులు లేని లోటును తట్టుకొని ముందుకెళ్లేలా ధైర్యాన్ని  ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని  తెలియజేస్తున్నామన్నారు. 

మృతి చెందిన వారికి నివాళులర్పి స్తున్నామన్నారు. 


 దుర్ఘటన ఎలా జరిగిందో త్వరగా పోలీసు విచారణ పూర్తి చేయించి బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.


ఈ కార్యక్రమంలో కందుకూరు ఇన్చార్జి ఆర్డీవో కావలి ఆర్డిఓ శ్రీ సీనా నాయక్,  తహసిల్దార్ శ్రీ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. 

Comments