కొల్లిపర కృషి విజ్ఞాన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ప్రారంభోత్సవం

 కొల్లిపర (ప్రజా అమరావతి);      కొల్లిపర కృషి విజ్ఞాన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ను ప్రారంభించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వివిధ గ్రామాల నుంచి రైతులందరినీ సభ్యులుగా చేర్చి నో ప్రాఫిట్, నో లాస్ అనే కాన్సెప్ట్ తో సరసమైన ధరలకంటీ ప్రొడక్షన్ వాల్యూకి విత్తనాలు గాని ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ లేకుండా రైతులకి సకాలంలో ఎరువులు, పురుగుమందులు,


విత్తనాలు కానీ అందించడమే కాకుండా మరలా వారు పండించిన పంటను ఏ పంట అయితే రైతులు పండిస్తారు దానిని బైబ్యాక్ తీసుకుని దానిని రీప్రొడ్యూస్ చేసి కస్టమర్ యూజెస్ గా ప్రజలు ఏ రకంగా వినియోగించుకుంటారో ఆ రకంగా దానిని మౌల్డ్ చేసి, షేక్ చేసి ఈ రోజున మల్టీ నేషనల్ కంపెనీస్ అన్ని కూడా ఈ టైప్ ఆఫ్ మార్కెటింగ్ లో పెద్ద ఎత్తున ఉన్నాయన్నారు. కానీ ఇక్కడ పంట వేసిన వారు, పండించేవాడు, దానిని మళ్లీ ప్రాసెస్ చేసిన వారు, దానిని తీసుకువెళ్లి మార్కెట్ చేసేవారు ఇందులో ఉన్న గొప్పతనం. ఆ రకంగా దాదాపు 2600 మంది సభ్యత్వంతో ప్రారంభమైన సమస్త ఇది అందరికీ ఉపయోగపడేలా మనకు మనం రైతుకు ఆసరాపడేలా రైతు సమ్మేళనం, రైతు సంఘటితం, రైతు సమిష్టి కృషి తద్వారా దళారీ వ్యవస్థను దరిరానీయకుండా పండిన పంటని మార్కెట్లో ఉన్న రేటుకి అమ్మేటప్పుడు గాని ఒక రేటు ఉంటే కొనేటప్పుడు ఒక రేటు ఉంటుంది ఏ వస్తువు తీసుకున్న కూడా ధాన్యం, పసుపు, కంద, నిమ్మ, అరటి పంట తీసుకున్న పంట పండేటప్పుడు కి, రైతు అమ్ముకునేటప్పటికీ ఉన్న ధరకి వినియోగదారుడు కొనే ధరకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది నోటాచబుల్ ఐటమ్ దీనిమీద వినియోగదారులు పన్ను లేవు, వాల్యూ టాక్స్ ఏమీ లేవు ప్రభుత్వాలు దీనిని గమనించాలి అని అన్నారు. కావున ఇలాంటి కంపెనీలు కానీ, కో-ఆపరేట్ సొసైటీస్ కానీ, కాన్సెప్ట్ సొసైటీస్ గాని ఆ కాన్సెప్ట్ ని పొలిటికల్ చేసి నిజమైన లబ్ధిదారులకు లాభం లేకుండా చేసినటువంటి విధానం మనం చూస్తున్నాం అందుకనే ఈ రోజున ఈ కృషి విజ్ఞాన్ అందరికీ ఉపయోగపడేలా చేసే డైరెక్టర్ లు, వెల్ నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు. అందుకనే ఈ కంపెనీ సక్సెస్ అవుతుందని మనసా వాసా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు అధ్యక్షులు మర్రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి, భీమవరపు. వేణుగోపాల్ రెడ్డి. మేనేజింగ్ డైరెక్టర్, ఉయ్యూరు. శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్, భీమవరపు. బసివి రెడ్డి. డైరెక్టర్, సభ్యులు ఆరిమండ కృష్ణారెడ్డి,  ఆరిమండ. వెంకటరెడ్డి, బొల్లు. యోగానంద చటర్జీ, కొల్లి. సుబ్బారెడ్డి, వల్లభాపురం బసవేశ్వర రావు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Comments