బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన డిప్యూటీ సి ఎం

 


*బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన డిప్యూటీ సి ఎం**సంఘటన బాధాకరం* *బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది*


*గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణ సాయంగా ఒక్కొక్కరికి రూ.5 లక్షల రూపాయల సహాయం* 


                 *: ఉప ముఖ్యమంత్రి*


చిత్తూరు, డిసెంబర్ 8 (ప్రజా అమరావతి): పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు వద్ద ట్రాక్టర్ బోల్తాపడి 6 మంది మృతి చెందారని, ఈ సంఘటన చాలా బాధాకరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖామాత్యులు శ్రీ కే.నారాయణస్వామి అన్నారు. గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ నెల 7 వ తేది బుధవారం రాత్రి పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు వద్ద ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో మృతి చెందిన 6 మంది మృతదేహాలకు పూతలపట్టు శాసనసభ్యులు ఎం.ఎస్.బాబుతో కలిసి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 


            రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించుటలో భాగంగా ఐరాల మండలం మెటకంపల్లిలో ట్రాక్టర్ డ్రైవర్ సురేంద్రరెడ్డి కుటుంబ సభ్యులను, బలిజపల్లిలో మృతురాలు వసంతమ్మ కుటుంబ సభ్యులను, తవనంపల్లి మండలం తెల్లగుంట్లపల్లిలో గుణశేఖర్ భార్య మృతురాలు తేజ, పిల్లలు వినీషా శ్రీ, దేశాశ్ శ్రీ లకు, చిత్తూరు మురుకం బట్టు వద్ద మృతు రాలు రెడ్డమ్మలకు పూలమాలవేసి నివాళులర్పించారు. 


           అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జరిగిన సంఘటన చాలా బాధాకరమని, ఈ ఘటన పై రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణ సాయంగా మృతులు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున వారి కుటుంబాలకు అందించడం జరుగుతుందని తెలిపారు. పూతలపట్టు శాసన సభ్యులు మృతులు ఒక్కొక్కరికి తన వంతు సహాయంగా రూ.25 వేలు బాధిత కుటుంబాలకు అందిస్తానని తెలిపారు.


        ఈ కార్యక్రమం లో నాయకులు జయచంద్రా రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజారత్నం రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి బుజ్జి రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


----&&&&-------


అనంతరం ఈ సంఘటనలో గాయపడి చిత్తూరు జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను డిప్యూటీ సీఎం కే. నారాయణస్వామి, చిత్తూరు ఎం ఎల్ ఏ ఆరణి శ్రీనివాసులు, పూతల పట్టు ఎం ఎల్ ఏ ఎం.ఎస్.బాబు లు పరామర్శించారు. క్షతగాత్రులకు అందిస్తున్న చికిత్స పై వైద్యం అందిస్తున్న డాక్టర్ లను అడిగి తెలుసుకుని, వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు.  


          డిప్యూటీ సీఎం వెంట చిత్తూరు ఆర్ డి ఓ రేణుక, డిసిహెచ్ఎస్ నాయక్, డిస్టిక్ హాస్పిటల్ మెడికల్ సూపర్నెంట్ డాక్టర్ అరుణ్ కుమార్, చిత్తూరు, తవణం పల్లి తహశీల్దార్లు పార్వతి, సుశీలాదేవి లు,అపోలో యూనిట్ హెడ్ నరేష్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.


Comments