రాష్ట్ర అభివృద్ధికి కమలాపురం నియోజకవర్గం ఆయువుపట్టు కావాలి* *రాష్ట్ర అభివృద్ధికి కమలాపురం నియోజకవర్గం ఆయువుపట్టు కావాలి


*


* *కమలాపురం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి*


*కమలాపురం నియోజకవర్గ ప్రగతి.. రాష్ట్రానికి ఆదర్శం కావాలి*


* *పులివెందుల పట్టణ పరిధిలో రూ.904.8 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం*


కమలాపురం, డిసెంబర్ 23 (ప్రజా అమరావతి): కమలాపురం నియోజకవర్గం రాష్ట్ర అభివృద్ధికి ఆయువు పట్టు కావాలని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు.


మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం కమలాపురం నియోజకవర్గ కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అక్కడి సి.ఎస్.ఐ. చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. కమలాపురం నియోజకవర్గంలో రూ.904.8 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన 8 రకాల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 


ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి. సృజన, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్ అకేపాటి అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ డిసీ గోవింద్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి, పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జెసి సాయి కాంత్ వర్మ, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


కార్యక్రమంలో ముందుగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. జ్యోతి ప్రజ్వలన గావించి, దివంగత నేత డా.వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.


** *కమలాపురం నియోజకవర్గ పరిధిలో.. దాదాపు 904.8 కోట్లకు పైగా వ్యయంతో వివిధ రకాల అభివృద్ధి నిర్మాణ పనులకు  చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేసిన వివరాలు*  


1. కడప నగరానికి సమీపంలోని.. కొప్పర్తి గ్రామ పరిధిలో రూ.221 కోట్ల వ్యయంతో.. ఎపిఐఐసి ఆధ్వర్యంలో 6,914 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న  వై.యస్.ఆర్. జగనన్న పారిశ్రామిక వాడలో నీటి అవసరాల నిమిత్తం..  బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ నుండి నీటి సరఫరా, నీటి స్టోరేజ్ చేసేందుకు గాను రూ.188 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేశారు.


అదే కొప్పర్తి పారిశ్రామిక వాడలో.. రూ. 34.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఎగ్జిక్యూటివ్ సెంటర్ నిర్మాణ పనులకు, అలాగే.. రూ.54.00 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న లాజిస్టిక్ పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 


2. రోడ్లు భవనాల శాఖకు సంబంధించి.. రూ. 8.00 కోట్ల వ్యయంతో కోగటం–పాయసంపల్లె రోడ్డు రిపేరీ, పునరుద్ధరణ పనులు, రూ.3.28  కోట్లతో ఖాజీపేట–కమలాపురం రోడ్డు (సంబాటూరు వరకు) రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడమైనది.


3. కమలాపురం పట్టణ ప్రజా అవసరాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని.. కమలాపురం పట్టణ నడిబొడ్డున రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్.ఓ.బి.) ఏర్పాటుకు రూ.39.00 కోట్ల వ్యయ అంచనాకు మించి 19.99% అధికంగా గుత్తేదారులకు చెల్లిస్తూ.. నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేయడం జరిగినది. 


ఈ ఆర్.ఓ.బి నిర్మాణం పూర్తయితే.. కమలాపురం పట్టణ వాసులకు దశాబ్దాల కాలం నుండి ఎదుర్కొంటున్న రైల్వే గేటు సమస్యకు శాశ్విత పరిష్కారం లభించనుంది.


4. కమలాపురం పట్టణంలో ఇరుకు రోడ్ల విస్తరణకు  వాణిజ్య పరమైన నిర్మాణాలను తొలగించకుండా,  అవసరాల సౌలభ్యం కోసం.. పట్టణానికి వెలుపల బైపాస్ రోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చేపట్టిన భూ సేకరణ పనుల కోసం రూ.16 కోట్లు, బైపాస్ రోడ్డులోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మరియు రెండు అప్రోచ్ లింక్ రోడ్లకు గాను రూ. 72 కోట్లు మంజూరు చేసి.. సంబంధిత పనులకు కూడా నేడు శంకుస్థాపన చేయడమైనది.


5. రూ.25.70 కోట్ల వ్యయంతో.. కడప – ఓబులంపల్లి – రామనపల్లి - రాచనాయపల్లి రోడ్డును 16 కి.మీ. మేర డబుల్ లేన్ రోడ్డుగా అభివృద్ధి పరిచే నిర్మాణ పనులకు గాను శంకుస్థాపన చేయడమైనది.


6. రూ. 22.20 కోట్ల వ్యయ అంచనాతో వల్లూరు – ఆదినిమ్మాయపల్లి రోడ్డు, చిన్న మాచుపల్లి – పుష్పగిరి రోడ్లను డబుల్ లేన్ రోడ్లుగా విస్తరిస్తూ గ్రామాల మధ్యలో సిమెంట్ రోడ్లను నిర్మించే పనులకు గాను శంఖుస్థాపన చేయడం జరిగినది. 


7. NH-716 పరిధిలోని రేణిగుంట – కడప – ముద్దనూరు జాతీయ రహదారిపై కమలాపురం పట్టణ శివార్లలో పాపాఘ్ని నదిపై రూ. 82.2 కోట్లతో ఏర్పాటు కానున్న నూతన వంతెన (హై లెవెల్ బ్రిడ్జ్) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడమైనది.  


ఈ వంతెన నిర్మాణం పూర్తయితే.. పారిశ్రామిక, వాణిజ్య ముఖ్య పట్టణాలైన తాడిపత్రి, ముద్దనూరు, యర్రగుంట్ల, కడప, రాజంపేట, తిరుపతి మరియు చెన్నై నగరాలను కలిపే రవాణా వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది. అంతేకాకుండా ఈ మార్గం సుప్రసిద్ద పుణ్య క్షేత్రాలైన శ్రీకాళహస్తి, తిరుమల మరియు ఒంటిమిట్ట లను కలుపుతుంది. 


8. గాలేరు నగరి సుజాల స్రవంతి (GNSS) ఫేజ్ – I ప్యాకేజీ – II క్రింద మిగులు పనులుకు సంబంధించి రూ. 212.89 కోట్లతో పలు నిర్మాణపనులు చేపట్టేందుకు శంఖుస్థాపన చేయడమైనది.  ఈ పనులు పూర్తయితే నియోజకవర్గంలోని కమలాపురం, వీరపునాయునిపల్లె మండలాలతోపాటు జమ్మలమడుగు నియోజకవర్గంలోని ముద్దనూరు, యర్రగుంట్ల మండలాల్లో మొత్తం 35,000 ఎకరాల ఆయకట్టు భూములకు మేలు చేకూరనుంది.


9. కమలాపురం నగర పంచాయతీ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు గాను రూ.58.20 కోట్ల వ్యయంతో సమగ్ర త్రాగునీటి సరఫరా పథకం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. 


10. కమలాపురం పట్టణంలో వర్షం నీరు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనులకు గాను.. రూ.7.99 కోట్ల వ్యయ అంచనాతో పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. 


11. కమలాపురం పట్టణ అభివృద్ధి సుందరీకరణలో భాగంగా.. రూ. 5.70 కోట్ల వ్యయంతో సెంట్రల్ మీడియన్లు, జంక్షన్లు మరియు ఆర్చులు మొదలైన అభివృద్ది నిర్మాణ పనులకు శిలాఫలకం వేయడమైనది. 


12. రూ. 18.60 కోట్ల వ్యయంతో కమలాపురం నగర పంచాయతీలో మురుగు నీటి శుద్ధి నిర్మాణ పనులు మరియు రూ. 3.00 కోట్ల రూపాయలతో మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు గాను  శంఖుస్థాపన చేయడమైనది. 


13. కమలాపురం పట్టణంలో 160 సంవత్సరాల చారిత్రక ప్రాముఖ్యం కలిగిన దర్గా ఏ హజరత్ అబ్దుల్ గఫ్ఫార్ షా ఖాద్రి దర్గా అభివృద్ది కోసం రూ. 2.45 కోట్ల వ్యయంతో ఫంక్షన్ హాల్ మరియు కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడమైనది.


14. రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్ జిల్లాలో రూ.15.00 కోట్ల వ్యయ అంచనాతో ఆప్కాబ్  (APCOB) శిక్షణా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమైనది. ఈ శిక్షణా కేంద్రం ద్వారా ఆప్కాబ్, డిసిసిబి, పిఏసీఎస్ ఉద్యోగులకు నిరంతర శిక్షణా కార్యక్రమాల నిర్వహణ చేపట్టడం జరుగుతుంది


కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ లో వున్న ఆప్కాబ్ ట్రైనింగ్ సెంటర్ తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కావడంతో మన రాష్ట్రానికి నూతనంగా ఈ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది.


15. రూ. 36.00 కోట్ల అంచనా వ్యయంతో కమలాపురం మండలం ఎల్లారెడ్డిపల్లె గ్రామ పంచాయతి పరిధిలో 5 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో నూతన బాలుర గురుకుల పాఠశాల నిర్మాణ పనులు చేపట్టుటకు ఈ రోజు శంఖుస్థాపన చేయడం జరిగినది. ఈ గురుకుల పాఠశాల ఏర్పాటుతో సుమారు 720 మంది విద్యార్థులకు విద్య, వసతి సౌకర్యాలు సమకూరనున్నాయి. 


** కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ... సంక్షేమ ప్రదాత ఆరోగ్య విధాత, విద్యా ప్రదాతగా.. దేశవ్యాప్తంగా కీర్తి గడిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ రోజు మన కమలాపురం నియోజకవర్గంలో పర్యటించడం.. సంతోషించదగ్గ విషయం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో.. అభివృద్ధికి ఏ మాత్రం నోచుకోని కమలాపురం నియోజకవర్గాన్ని.. అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. కమలాపురం నియోజకవర్గ ప్రజల తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి సోపానంగా.. కార్యరూపం దాల్చుతున్న నియోజకవర్గంలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కు.. భవిష్యత్తులో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందించనుంది.. అని చెప్పుకోవడం గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం  రూ.1580 కోట్లకు పైగా జియోజకవర్గంలో పలురకాల అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.


అంతే కాక.. నియోజక వర్గంలో ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో.. వెయ్యి కోట్లకు పైగా లబ్ది చేకూర్చడం జరుగుతోందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా.. ఎనిమిది వేలకు పైగా జగనన్న కాలనీలు, సొంత ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టిందంటే.. అంది నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భవిస్తున్నామన్నారు. 


ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర కార్పొరేషన్ల  చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ట్రైనీ కలెక్టర్ రాహుల్ మీనా, కడప, బద్వేలు ఆర్డీవోలు ధర్మచంద్రారెడ్డి, వెంకటరమణ, డ్వామా, డీఆర్డీఏ పిడీలు యదుభూషన్ రెడ్డి, పెద్దిరాజు, తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. Comments