రావి ఆధ్వర్యంలో విస్తృతంగా టీడీపీ కార్యక్రమాలు

 *- రావి ఆధ్వర్యంలో విస్తృతంగా టీడీపీ కార్యక్రమాలు


 *- పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు* 

 *- గుడివాడలో "ఇదేం ఖర్మ రాష్ట్రానికి" అనూహ్య స్పందన* 


గుడివాడ, డిసెంబర్ 20 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడలో విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టారు. ముందుగా స్థానిక టీడీపీ కార్యాలయంలో రావి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య తదితరులు విచ్చేసి రావికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో రావి పుట్టినరోజు కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణ తదితరులు మాట్లాడుతూ గుడివాడలో తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రావి మరిన్ని పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పార్టీ శ్రేణులు రావి, కొల్లు, కొనకళ్ళలను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ముళ్ళపూడి రమేష్ చౌదరి, శొంఠి రామకృష్ణ, కంచర్ల సుధాకర్, సుబ్రహ్మణ్యేశ్వరరావు, పోలాసి ఉమామహేశ్వరరావు, ఆర్ వేణు తదితరులు పాల్గొన్నారు.

గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని జీవీ పూర్ణచంద్రరావు కమ్యూనిటీ హాల్లో జరిగిన తానా ఫౌండేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, తానా అధ్యక్షుడు లావు అంజయ్యచౌదరిలతో కలసి 

మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానా చైతన్య స్రవంతి, రోటరీ క్లబ్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వినికిడి, కంటి పరీక్షలు, కేన్సర్ పరీక్షల శిబిరం, ఆదరణ కుట్టుమిషన్లు, చేయూత స్కాలర్ షిప్ లను పంపిణీ చేయడం జరిగింది. వీ సీతారామ్మోహనరావు జ్ఞాపకార్ధం రోటరీ వైకుంఠ రథాన్ని అందజేయడం జరిగింది. అలాగే 

మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో "ఇదేం ఖర్మ రాష్ట్రానికి" కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య తదితరులు విచ్చేశారు. నెహ్రూచౌక్ సెంటర్ నుండి మున్సిపల్ కాంప్లెక్స్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రజలను కలిసి ప్రభుత్వ పాలనను అడిగి తెలుసుకున్నారు. పలువురు వ్యాపారులు ప్రభుత్వ వ్యతిరేకతను తెలిపారు. అనంతరం రావి, కొల్లు, కొనకళ్ళ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలతో పాటు వ్యాపారులను కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దోచుకుంటోందన్నారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కన్పిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అధికారం తథ్యమన్నారు. ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ముళ్ళపూడి రమేష్ చౌదరి, కంచర్ల సుధాకర్, పోలాసి ఉమామహేశ్వరరావు, ఆర్ వేణు తదితరులు పాల్గొన్నారు.

Comments