*ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం*
అమరావతి (ప్రజా అమరావతి): వైద్య ఆరోగ్య శాఖ లో సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ మరియు నేషనల్ హెల్త్ మిషన్ నేషన్ హెల్త్ మిషన్ డైరెక్టర్ శ్రీ జె.నివాస్ నేడొక ప్రకటన లో తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఈ పోస్టుల్ని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 2వ తేదీ నుండి వెబ్సైట్ లో దరఖాస్తు ప్రొఫార్మా అందుబాటులో వుంటుందనీ , ఈనెల 12వ తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తుల్ని అందజేయాలని తెలిపారు. ఖాళీల వివరాలు, అర్హతలు, పోస్టులకు కావాల్సిన అనుభవం, నియామక విధానం అదితర వివరాల్ని www.cfw.ap.nic.com వెబ్సైట్ లో పొందుపర్చామని వివరించారు. వెబ్సైట్ లో వున్న దరఖాస్తు ప్రొఫార్మా తప్ప ఇతర ప్రొఫార్మా లో పంపించే దరఖాస్తుల్ని పరిగణనలోకి తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు.
addComments
Post a Comment