పేదవానికి సొంతళ్ళు అందించాలనే ఉద్దేశ్యం తో వారిపై ఆర్థిక భారం పడకుండా కేవలం ఒక్క రూపాయితోనే రిజిస్ట్రేషన్


రామచంద్రపురం (ప్రజా అమరావతి);

 


 పేదవానికి సొంతళ్ళు అందించాలనే ఉద్దేశ్యం తో వారిపై ఆర్థిక భారం పడకుండా కేవలం ఒక్క రూపాయితోనే రిజిస్ట్రేషన్


చేసి వారి కలను సాకారం చేసిన  ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని  రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

బుధవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా  రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రపురం పురపాలక సంఘం పరిధిలో కొత్తూరు గ్రామంలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను  మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేశారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని మౌలిక వసతులు కల్పించిన అనంతరమే గృహాలు అందించడం జరుగుతుందని ఎటువంటి అపోహలకు నమ్మవద్దని తెలిపారు.

 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన Tidco గృహానికి  నెలకు 3,000 రూపాయలు   చొప్పున 20 సంవత్సరాల పాటు లబ్ధిదారుడు చెల్లించవలసి ఉంటుందని ఈ భారాన్ని మోయలేరని గుర్తించిన ముఖ్యమంత్రి నామమాత్రపు రిజిస్ట్రేషన్తో  సొంతయింటి కలను సాకారం చేశారన్నారు. దీనికోసం ప్రభుత్వం అదనంగా 10,500 కోట్ల రూపాయలు భరించిందన్నారు.

 ముఖ్యమంత్రి, బి ఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్, జ్యోతిరావు పూలే ఆసియాలనుగుణంగా పేదరికంలో ఉన్నవారికి సాధికారికత చేకూర్చే విధంగా ముందుకు వెళుతున్నారని, ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా  24 పథకాలు రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతున్నాయన్నారు. రామచంద్రపురం లో మొదటి దశలో 1088 గృహాలను అన్ని మౌలిక సదుపాయాలతో అందించడం జరిగిందని, రానున్న రెండు మూడు నెలల్లో మిగిలిన గృహాలను అందించే విధంగా పనులు జరుగుతున్నాయని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

 మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ సూచనల మేరకు కొత్తూరు వెళ్లే రహదారికి రోడ్ నిర్మించడంతోపాటు పంట కాలువలపై  డ్రైన్ నిర్మించే విధంగా తన వంతు కృషి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రానున్న రోజుల్లో కొత్తూరు లోని  వైయస్సార్ జగనన్న నగర్ నూతన వరవడికి నాంది పలుకుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో అవసరమైన  మౌలిక సదుపాయాల కల్పన జరిగిందని రానున్న రోజుల్లో హెల్త్ సెంటర్, సచివాలయం ఆవశ్యకత ఉంటుందని తెలిపారు. సొంతింటి కల అనేది ఒక హక్కుని దీనిని ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా సార్థకత చేయడం ఆనందంగా ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

 మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సూక్ష్మస్థాయిలో నిర్ణయాలు తీసుకుంటూ  పేదవారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారన్నారు. ఇందులో భాగంగా వైద్యం కోసం ఉచిత వైద్య సేవలు, చదువుల కోసం అమ్మబడి, వృద్ధాప్యంలో పెన్షన్లు వంటి పథకాలను అమలు జరుగుతున్నాయన్నారు. పరిపాలనలో సంస్కరణలను తీసుకువచ్చి సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందించే విధంగా నిర్మాణాత్మకమైన వ్యవస్థ రాష్ట్రంలో అమలు జరుగుతుందన్నారు.

సొంతింటి కల సాకారం చేసే విధంగా రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలు, వైయస్సార్ గృహ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా రామచంద్రపురం లోని కొత్తూరులో నిర్మించిన టిట్కో గృహ సముదాయాలను ముఖ్యమంత్రి జన్మదిన రోజున లబ్ధిదారులకు అందించడం సంతోషంగా ఉందన్నారు.


జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ లబ్ధిదారులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందించాలని ఉద్దేశంతో టిట్కో గృహ నిర్మాణపు పనులు కొంత ఆలస్యం జరిగిందని, దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న Tidco లబ్ధిదారులకు శుభ పరిమాణం అని అన్నారు. జిల్లాలో సంక్షేమ అభివృద్ధి పథకాలు సజావుగా జరుగుతున్నాయని రోడ్లు,డ్రైన్స్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు జిల్లాలో సజావుగా జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ tidco చైర్మన్ జమ్మన  ప్రసన్నకుమార్, మేనేజింగ్ డైరెక్టర్ చిత్తూరు శ్రీధర్, రామచంద్రాపురం మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి Tidco డైరెక్టర్స్ కానూరి నాగేశ్వరి,  ప్రతివాడ రాఘవరావు, రామచంద్రపురం ఆర్డీవో సింధు సుబ్రహ్మణ్యం, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రియంవద సంబంధిత శాఖల అధికారులు పెద్ద ఎత్తున లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం తో పాటుగృహాలు అందుకుంటున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

తొలితగా మంత్రులు కొత్తూరు Tidco లేఔట్ లో వేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి నూతన గృహప్రవేశాలు చేసే వారి ఇంటికి వెళ్లి రిబ్బన్  రిబ్బను కత్తిరించి గృహప్రవేశాలు కార్యక్రమం నిర్వహించారు.

 ఈ కార్యక్రమాలను సాంప్రదాయపద్ధంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ మత గురువుల ఆశీర్వచనాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

Comments