రేషన్ కార్డు దారులకు అత్యంత పారదర్శకంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టాలిరాజమహేంద్రవరంరూరల్

(రాజావోలు, . హుకుంపేట) (ప్రజా అమరావతి);

 రేషన్ కార్డు దారులకు అత్యంత పారదర్శకంగా  నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టాల


ని  జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. లబ్ధిదారుల సంతృప్తి స్థాయి పై అభిప్రాయ సేకరణ చేపట్టి అందుకనుగణంగా పంపిణీ వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం రూరల్ రాజవోలు ఎఫ్ పి షాప్ 27 , హుకుంపేట  ఎఫ్ పి షాప్ 33  చౌక ధరల దుకాణాలను, రాజవోలు ఎఫ్ సి ఐ స్టాక్ గోడౌన్ ను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగాతనిఖీ చేసి, సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్  మాట్లాడుతూ, ప్రభుత్వ  ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అంద చేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియ అమలు చేయడం పై క్షేత్ర స్థాయి లో అమలు తీరును పర్యవేక్షించడం జరిగిందన్నారు.  ఆ దిశలో చౌక ధరల దుకాణాలను , గోడౌన్ లలో స్టాక్ వివరాలు, సరుకు వాహనాలు రికార్డుల ను కూడా తనిఖీ చేయడం జరిగిందన్నారు.   " ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన " కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా అందచేస్తున్న బియ్యం పంపిణీ వివరాలు, లబ్దిదారుల వివరాలతో రికార్డుల నిర్వహణ తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో జాయింట్ కలెక్టర్ ముఖా ముఖి సంభాషించారు. మరింత మెరుగ్గా ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు లో ప్రజలు వారి సూచనలు తెలియ చేయాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం అందచేస్తున్న బియ్యం నాణ్యత, డీలర్ ద్వారా అందచేస్తున్న క్వాంటిటీ పై వాకబు చేశారు. రాజవోలు ఎఫ్ పి స్టాక్ గోడౌన్ లోని బఫర్ స్టాక్ రికార్డులను పరిశీలించారు.జాయింట్ కలెక్టర్ వెంట  పౌర సరఫరాల క్షేత్ర స్థాయి అధికారులు ఏ ఎస్ వో కే. విజయ భాస్కర్, డి ఎం ఆర్. తనూజా, డిటి సిహెచ్. మల్లేశ్వరి, , సిబ్బంది,  ఎఫ్ పి షాప్, గో డౌన్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు Comments