సకల వసతులతో 'బుగ్గన శేషారెడ్డి మెమోరియల్ ఇండోర్ స్టేడియం ప్రారంభం

 

 *సకల వసతులతో 'బుగ్గన శేషారెడ్డి మెమోరియల్ ఇండోర్ స్టేడియం ప్రారంభం


*


*రూ.2కోట్లతో నిర్మించిన స్టేడియాన్ని పత్తికొండ ఎంఎల్ఏ శ్రీదేవితో కలిసి ప్రారంభించిన మంత్రి బుగ్గన*


*డోన్ లోని 18వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న మంత్రి* 


డోన్, నంద్యాల, డిసెంబర్, 31 (ప్రజా అమరావతి); తన సొంత నియోజకవర్గం డోన్ లో "బుగ్గన శేషారెడ్డి మెమోరియల్ ఇండోర్ స్టేడియాన్ని" ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు.ఇండోర్ స్టేడియాన్ని పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే  శ్రీదేవితో కలిసి మంత్రి బుగ్గన ప్రారంభించారు. డోన్ రైల్వేస్టేషన్ రోడ్డులోని యూనియన్ క్లబ్ ఆవరణలో రూ.2 కోట్లతో సకల సదుపాయాలతో అత్యాధునికంగా దీన్ని నిర్మించినట్లు మంత్రి వెల్లడించారు. రెండు సింథటిక్ కోర్టులు, ప్రేక్షకుల గ్యాలరీ సహా సకల సదుపాయాలతో డోన్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. డోన్ పట్టణంలోని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి  పాత బస్టాండ్ మీదుగా   ప్రారంభోత్సవ వేదిక వద్దకు మంత్రి బుగ్గన ప్రజలతో కలిసి పాదయాత్ర చేస్తూ కలిసి వెళ్లారు. అనంతరం స్టేడియం వద్ద స్థానిక ప్రజలు, నాయకులతో మంత్రి బుగ్గన సమావేశమై మాట్లాడారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా ఇండోర్ స్టేడియంలోని సింథటిక్ కోర్టులో షటిల్ ఆడి సరదాగా గడిపారు. అంతకుముందు డోన్ లోని 18వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి బుగ్గన పాల్గొన్నారు. వార్డులోని ప్రతి గడప తిరుగుతూ స్థానికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. మంత్రి గారి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 18వ వార్డు ప్రజలు సంతోషంగా స్వాగతం పలికారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు, సంక్షేమంతో పాటు పట్టణమంతా రహదారులు వేయించడం పట్ల మంత్రి బుగ్గనకు హారతులు పట్టి వారు హర్షం వ్యక్తం చేశారు. 


Comments