మార్గం కనిపించింది... కానుక అందించింది...

 


*మార్గం కనిపించింది... కానుక అందించింది...**చికిత్స పొందుతున్న రోగికి పింఛ‌ను అందించిన వాలంటీర్మ‌న‌సుంటే మార్గం త‌ప్ప‌క ఉంటుంద‌నే మాట‌కు ఈ చిత్రమే నిద‌ర్శ‌నం. విజ‌య‌న‌గ‌రానికి స‌మీపంలోని ఎం. లింగాల‌వ‌ల‌స‌కు చెందిన గుడివాడ చిన్న‌య్య‌ ఇటీవ‌ల అనారోగ్యానికి గుర‌య్యారు. ఆయ‌న్ని కుటుంబ స‌భ్యులు విజ‌య‌న‌గ‌రం ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అవ్వాతాత‌ల‌కు ఆస‌రాగా అందిస్తోన్న‌ వైఎస్సార్ పింఛ‌ను కానుక ప‌థ‌కంలో ల‌బ్ధిదారుడైన‌ చిన్న‌య్య‌కు స్థానిక వాలంటీర్ మ‌జ్జి నారాయ‌ణ‌మ్మ శుక్ర‌వారం ఇదిగో ఇలా పింఛ‌ను కానుక‌ అందించింది. అంద‌రూ మెచ్చుకునేలా త‌న క‌ర్తవ్యాన్ని నిర్వ‌ర్తించింది.


 ః

Comments