మొదటి దశలో ఎం.పి.ఎఫ్.సి గోడౌన్ ల గ్రౌండింగ్ పూర్తి

 *మొదటి దశలో ఎం.పి.ఎఫ్.సి గోడౌన్ ల గ్రౌండింగ్ పూర్తి*


*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), డిసెంబర్ 01 (ప్రజా అమరావతి):


జిల్లాలో మొదటి దశలో మంజూరైన ఎం.పి.ఎఫ్.సి (మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ ) గోడౌన్ లకు సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందని రాష్ట్ర సహకార శాఖ కమీషనర్ అహ్మద్ బాబుకి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ వివరించారు.


గురువారం విజయవాడ నుంచి ఎం.పి.ఎఫ్.సి గోడౌన్ ల నిర్మాణం, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్ లతో రాష్ట్ర సహకార శాఖ కమీషనర్ అహ్మద్ బాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, డిసీఓ కృష్ణ నాయక్, ఏడిసిసి బ్యాంక్ జనరల్ మేనేజర్ సురేఖ రాణి, తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎం.పి.ఎఫ్.సి గోడౌన్ లకు సంబంధించి జిల్లాలో మొదటి దశలో 72 గోడౌన్లు మంజూరు కాగా, వాటి గ్రౌండింగ్ పూర్తి చేయడం జరిగిందన్నారు. గోడౌన్ల నిర్మాణం త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే రెండవ దశలో 55, మూడవ దశలో 22 ఎం.పి.ఎఫ్.సి గోడౌన్లు మంజురుకాగా, దశలవారీగా వాటి గ్రౌండింగ్ చేపడుతున్నామన్నారు.Comments