రహదారుల భూసేకరణ వేగవంతం కావాలి: రాష్ట్ర ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రద్యుమ్న

 రహదారుల భూసేకరణ వేగవంతం కావాలి:  రాష్ట్ర ఆర్ అండ్ బి  ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రద్యుమ్న 



పుట్టపర్తి, డిసెంబర్ 29 (ప్రజా అమరావతి): జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రాధాన్యతను గుర్తించాలని  భూసేకరణ, పరిహారం చెల్లింపులు చేపట్టి రహదారుల నిర్మాణాల వేగవంతానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్డు రవాణా మరియు ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ  పి.ఎస్.ప్రద్యుమ్న సూచించారు. గురువారం మద్యాహ్నం అమరావతి నుండి  రాష్ట్ర రోడ్డు రవాణా మరియు ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని జిల్లాల కలెక్టర్ లతో, జాయింట్ కలెక్టర్ లతో ఎన్.హెచ్.ఎ.ఐ. , ఆర్ అండ్ బి అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించగా  స్థానిక కలెక్టరేట్లోనే స్పందన  వీడియోకాన్ఫరెన్స్   హాలు నందు  జిల్లా కలెక్టర్ పి  బసంత కుమార్, జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్ తదితరులు పాల్గొన్నారు


పి.ఎస్.ప్రద్యుమ్న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల నిర్మాణాలకు రూ.50 వేల కోట్లు అందుబాటులో ఉందని భూసేకరణ, పరిహారాల చెల్లింపు పూర్తి చేసి ప్రారంభంకాని రహదారులను ప్రారంభించాలని, పురోగతిలో ఉన్న రహదారులు వేగవంతం చేయాలని సూచించారు.  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి చేరుకునేందుకు  అన్ని వైపుల నుంచి రవాణా  సౌకర్యాలను  మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైన తెలిపారు.  జిల్లాకేంద్రం మీదుగా నాలుగు లైన్ల రహదారికి ప్రభుత్వం  ఆమోదం తెలిపిందని  వివరించారు

NHAI dept వారి ప్రాజెక్టులకు 590 హెక్టర్లు MoRTH R&B dept వారి ప్రాజెక్టులకు 800 హెక్టార్ల భూమి అవసరం వుంది వాటిని త్వరగా  భూ సేకరణ కార్యక్రమం వేగవంతం చేయుచున్నామని తెలిపారు.


ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో రెవిన్యూ అధికారులు, ఎన్.హెచ్.ఎ.ఐ., ఆర్ అండ్ బి శాఖల  అధికారులు  పాల్గొన్నారు.



Comments