ప్రగతి పథంలో జిల్లాను రాష్ట్రంలో ఆరోవ స్థానం లో నిలపగలిగాం - కలెక్టర్ మాధవీలత



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 



జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ కు ఘనంగా వీడ్కోలు


నూతనంగా ఏర్పడిన జిల్లాలో తొలి దశలో సవాళ్ళను సమన్వయంతో ఎదుర్కొని పనిచేశాం


ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం అమలులో శ్రీధర్ మంచి తోడ్పాటు అందించారు 


ప్రగతి పథంలో జిల్లాను రాష్ట్రంలో ఆరోవ స్థానం లో నిలపగలిగాం 


- కలెక్టర్ మాధవీలత 


నూతనంగా జిల్లా ఏర్పాటు చేసిన రోజున తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన చామకూరి శ్రీధర్ విధులు నిర్వర్తించే క్రమంలో ఆదర్శంగా నిలిచారని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.


గురువారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బదలి పై వెళుతున్న జాయింట్ కలెక్టర్  సి హెచ్ శ్రీధర్ కు ఆత్మీయ సత్కారం కార్యక్రమం నిర్వహించారు. 


ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ,కలెక్టర్ గా నేను జాయింట్ కలెక్టర్ గా శ్రీధర్ నూతనంగా ఏర్పడిన జిల్లా కు వచ్చినపుడు ఎటువంటి వసతులు లేకపోయినా ప్రణాళిక బద్ధంగా ముందుకెలుతూ గడసిన 8 మాసాల్లో జిల్లా ను రాష్ట్రంలో 6 వ స్థానంలో నిలిపామన్నారు. అధికారులందరు కుటుంబ సభ్యులు గా పని చేస్తూ జిల్లా ను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నా మన్నారు . ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మకంగా చేపట్టి  నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం లో భాగంగా 90 రోజుల కార్యక్రమాన్ని అంతే నిబద్దత తో కూడి చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగానే క్షేత్ర స్థాయి లో పర్యటించి భూసేకరణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ, అధికారులకు , సిబ్బందికి ఎప్పటి కప్పుడు దిశా నిర్దేశనం చెయ్యడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ, వరద సమయంలో నిత్యవసర సరుకుల పంపిణీ తదితర అంశాలపై తనదైన ముద్ర వేసినట్లు తెలిపారు. ప్రస్తుత రబీ సీజన్ ధాన్యం సేకరణ కోసం, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు నిర్మాణం కోసం అవసరమైన ఇసుక కేటాయింపులు సజావుగా చేపట్టి పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిబద్ధత కలిగిన జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మరిన్ని ఉన్నత పదవులకు చేరాలని కలెక్టర్ అభిలషించారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో రాష్ట్రంలో జిల్లాను ఆరోవ స్థానం దక్కిందని, ఇందులో జేసీ తోడ్పాటు మరువలేని దన్నారు.


ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చామకూరి శ్రీధర్ మాట్లాడుతూ, జిల్లాలో గత ఏడు నెలల కాలంలో తనకు సహకరించిన కలెక్టర్ మాధవీలత , ఇతర అధికారులకు, సిబ్బందికి ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత లు తెలిపారు. జిల్లా కలెక్టర్ వారి దిశా నిర్దేశం లో ఎన్నో ఛాలెంజింగ్ పనులను సులభతరం చేసి, జిల్లాను అభివృద్ధి పనులు పూర్తి చెయ్యడం లో కృతకృత్యులవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం రబీ సీజన్లో ధాన్యం సేకరణ లో ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని  సంస్కరణ వలన తొలి దశలో ఎదుర్కొన్న ఇబ్బందులు అధిగమించడం ద్వారా రైతులకు మేలు చేసే దిశలో సాంకేతిక పరమైన సమస్యలు పరిష్కరించడం జరిగిందని ఆయన తెలిపారు. 


మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, సౌమ్యుడు గా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తనదైన ముద్ర వేసి, సజావుగా ప్రభుత్వ పథకాల అమలు లో అందరితో కలిసి పని చెయ్యడం జరిగిందన్నారు. 


ఈ సందర్బంగా  పలువురు జిల్లా అధికారులు  బదలీ పై వెళుతున్న  జాయింట్ కలెక్టర్ శ్రీధర్ జిల్లా లో చేసిన సేవలు గురించి  కొనియాడారు.


ఈ స్పందన కార్యక్రమం లో మున్సిపల్ కమీషనర్ కే. దినేష్ కుమార్, డీఆర్ ఓ జి. నరశింహులు,కొవ్వూరు, రాజమహేంద్రవరం

ఆర్డీవో ఎస్. మల్లిబాబు, ఏ.చైత్ర వర్షిణి, జిల్లా అధికారులు డి ఎం సివిల్ సప్లయస్ టి. తనూజా, ఎంపిడిఓ రత్నకుమారి, డిఎంహెచ్ఒ డా. కె. వెంకటేశ్వరారవు, డిసిహెచ్ డా.యం.సనత్ కుమారి, సీపీఓ కె.ప్రకాష్, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఈ డి. భాల శంకర్  డీపీవో పి. జగదాంబ,  డిఈ ఓ ఎస్. అబ్రహం, జిల్లా హౌసింగ్ అధికారి బి.తారాచంద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాధవ రావు, పశుసంవర్ధక శాఖ అధికారి సత్యగోవిందం, డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్, ట్రైబుల్ అధికారి కే. జ్యోతి, జి. బాపిరాజు, 

డిఆర్డిఏ పీ డి  ఇతర శాఖల అధికారులు,మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments