తెలంగాణ రైతులకు అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేంద్రం కుట్రలు.

 *తెలంగాణ రైతులకు అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేంద్రం కుట్రలు**రైతుపై కక్షకట్టిన బీజేపీ పార్టీ* 


*దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణతో బీజేపీలో వణుకు*


    *తెలంగాణ  రైతులు  పంట కల్లాల  ను నిర్మాణం చేసుకోవడానికి  151 కోట్లు ను చెల్లించాలంటున్న   కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా* 


ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నందు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ  రైతులు  పంట కల్లాల  ను నిర్మాణం చేసుకోవడానికి వినియోగించుకోవడానికి 151 కోట్లు ను తిరిగి చెల్లించాలంటున్న కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా   *రాష్ట్ర మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ గారు పిలుపుమేరకు* *జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు , ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో నిర్వహించి జరిగినది.  


ఈ ధర్నా కార్యక్రమంలో  స్థానిక శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి , మరియు అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ అబ్రహం,  జడ్పీ చైర్మన్ సరిత , రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, లు హాజరయ్యారు. 


   *ఎమ్మెల్యే  మాట్లాడుతూ....*


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు ఎన్నో సదుపాయాలు కల్పిస్తూ రైతులకు 24 గంటల ఉచిత కరెంటు రైతుబంధు

రైతు బీమా సకాలంలో ఎరువులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ 


మన కల్లాలపై కేంద్ర మోడీ ప్రభుత్వం కుళ్లు రైతులు అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇంత వివక్ష తగదు తెలంగాణ రైతు సోదరులారా మేల్కొనండి.


రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడే ఈ కల్లాల నిర్మాణాన్ని కావాలనే  కేంద్ర ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందని ఎమ్మెల్యే  విమర్శించారు.


 *రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉన్న వ్యవసాయ కల్లాల నిర్మాణం కి ఖర్చయిన 151 కోట్లను తిరిగి చెల్లించాలని కేంద్రం రాష్ట్రానికి నోటీసు ఇచ్చిందని అన్నారు.* 


 ఇంత మంచి కార్యక్రమం కోసం రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేసిన సహాయాన్ని ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ దుష్ప్రచారం చేస్తున్నదని ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్యక్రమాలకు అనుసంధానం చేయాలని  తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పదుల సార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.* 


 *ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో తో పాటు ప్రభుత్వం తరఫున పలుమార్లు కేంద్రానికి లేఖలు సైతం రాశామన్నారు. పార్టీ తరఫున కూడా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించామని ఆయన చెప్పారు.* 


 వ్యవసాయ అనుబంధ పనులను ఉపాధి హామీకి అనుసంధానం చేయడం పక్కనపెట్టి మొత్తం పథకాన్ని నీరు కార్చేలా అనేక షరతులు, కోతలను కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేర్చిందన్నారు.* 


 *గ్రామాలలో  కరోనా సమయంలో కష్టకాలం తర్వతా  ఉపాధి అవకాశాలు తగ్గాయని, గ్రామీణ అర్ధిక వ్యవస్ధ సంక్షోభంలో చిక్కుకుంటున్నా, కేంద్రం మాత్రం ఉపాధి హమీకి  నిధులు తగ్గిస్తూ వస్తున్నదని విమర్శించారు.* 


 మరోపైపు పెరిగిన ఎరువులు, పెట్రోల్ , డీజిల్ ధరలు, ఇతర  ఖర్చుల పెరుగుదల వలన వ్యసాయరంగం పంట పెట్టుబడులు పెరుతున్నాయని, కనీసం ఇప్పుడైన రైతులను అదుకునేందుకు వ్యవసాయంతో ఉపాధి హమీని అనసంధానం చేయాలని డిమాండ్ చేశారు.* 


*తెలంగాణ రాష్ట్రంలో రైతులు కట్టుకున్న వ్యవసాయ కల్లాలతో కలుగుతున్న ప్రయోజనాలను పట్టించుకోకుండా తెలంగాణపై గుడ్డి వ్యతిరేకతతో ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని మోడీ ప్రభుత్వం మొండిపట్టు పట్టడం దుర్మార్గం అని  మండిపడ్డారు*


*దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాతకోసం కల్లాలు నిర్మిస్తే…మోడీ సర్కారు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నదని విమర్శించారు.* 


 *తీర ప్రాంతాల్లోని రాష్ట్రాలలో చేపలు ఎండబెట్టుకునేందుకు ఇదే తరహా సిమెంట్ కల్లాలను  ఉపాధి హామీ పథకంలో భాగంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించిన విషయాన్ని కేంద్రానికి గుర్తు చేసినా పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులంటేనే కేంద్రానికి గిట్టడం లేదన్నారు.*  *గతంలో వ్యవసాయం దండగ అనేవారు కానీ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం అంటే పండగ నిరూపించిన ప్రపంచంలో గొప్ప నాయకుడు కేసీఆర్ గారు* 

  


  తెలంగాణ రాష్ట్రంలోనే అమలవుతున్న సంక్షేమ  పథకాలు అభివృద్ధి కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు కావాలని బీ.ఆర్ ఎస్ పార్టీ ఆవిష్కరించడం జరిగింది.   *అబ్ కి బార్ కిసాన్ సర్కార్* *అనే నినాదంతో కెసిఆర్ గారు బి.ఆర్ ఎస్ పార్టీ*   👉ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య,  జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, ఎంపీపీ విజయ్, రాజారెడ్డి, నజూమున్నీసా బేగం, జెడ్పీటీసీ రాజశేఖర్, పద్మ వెంకటేశ్వర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి, PACS ఛైర్మన్ తిమ్మారెడ్డి, వివిధ మండలం రైతు బంధు సమితి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ఈశ్వరయ్య, హనుమంతు, వైస్ చైర్మన్ బాబర్, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, రామకృష్ణ నాయుడు,వీరన్న, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు,అన్ని మండలం పార్టీ అధ్యక్షులు, సభ్యులు,   ఆలయం కమిటీ ఛైర్మన్ సతీష్,  కౌన్సిలర్స్, సర్పంచులు ఎంపీటీసీలు , సింగల్ విండో, వ్యవసాయ మార్కెట్ యార్డ్, ఆలయం కమిటీ డైరెక్టర్స్, అన్ని మండల &టౌన్ యూత్ అధ్యక్షులు కార్యవర్గం సభ్యులు,  BRS పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments