నేటి నుండి చౌడేపల్లి మండలం లో పల్లె బాట కార్యక్రమం



*నేటి నుండి చౌడేపల్లి మండలం లో పల్లె బాట కార్యక్రమం . .*

 

*పలు ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలను ప్రారంభించిన గౌ.రాష్ట్ర అటవీ, భూగర్భ గనుల శాఖామాత్యులు*

 

చౌడేపల్లి, డిసెంబర్ 29 (ప్రజా అమరావతి);



 గౌ. రాష్ట్ర ఇంధన, అటవీ, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ, భూగర్భ గనుల శాఖామాత్యులు డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ నెల 29 నుండి జనవరి 2 వ తేది వరకు పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలంలోని 139 గ్రామాలలో పల్లెబాట కార్యక్రమం ద్వారా పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గురువారం మొదటి రోజు కార్యక్రమాన్ని ఆకు తోట పల్లి గ్రామం నుండి ప్రారంభించిన మంత్రి 40 గ్రామాలలో పర్యటించ నున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలను గౌ. చిత్తూరు ఎంపి ఎన్. రెడ్డెప్పతో కలసి ప్రారంభించారు. 


         ఈ పర్యటనలో భాగంగా ఎ కొత్తకోట గ్రామంలో రూ.40 లక్షలతో గ్రామ సచివాలయ భవనాన్ని, రూ.17.50 లక్షలతో డా. వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ లను, దుర్గ సముద్రం గ్రామంలో రూ.21.80 లక్షలతో ఆర్ బి కే భవనాన్ని, బయప్పల్లి గ్రామంలో రూ. 7.2 లక్షల లతో అంగన్వాడీ భవనా న్ని, చారాల గ్రామంలో రూ.17.50 లక్షలతో డా. వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ లను గౌ. చిత్తూరు ఎంపి ఎన్. రెడ్డెప్పతో కలసి మంత్రివర్యులు ప్రారంభించారు. మంత్రివర్యులు గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార దిశగా పర్యటన సాగింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటించిన మంత్రికి నవరత్నాల పథకాల లబ్దిదారులు ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు పట్ల సంతృప్తిని వ్యక్తం చేసారు. 


          ఈ పర్యటనలో మంత్రితో పాటు గౌ. జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు,గౌ. రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి,గౌ.

జడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయ రెడ్డి,గౌ. బోయకొండ గంగమ్మ పాలక మండలి చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, జెడ్పి సిఈఓ ప్రభా కర్ రెడ్డి,డ్వామా పిడి గంగాభవాని, చౌడే పల్లి ఎంపీపీ రామ్మూర్తి, జడ్పిటిసి దామోదర్ రాజు, తహశీల్దారు మాధవ రాజు, ఎంపీడీఓ సుధాకర్, ఆర్ డ బ్ల్యూఎస్ డీఈ వెంక టేశ్వర్లు,వ్యవసాయ శాఖ ఎడి శివ శంకర్,  పి ఆర్ డి ఈ ప్రసాద్, ట్రాన్స్కో డి ఈ ఈ విజయన్ఇతర నియోజకవర్గస్థాయి, మండల స్థాయి అధి కారులు, ప్రజా ప్రతి నిధులు, తదితరులు పాల్గొన్నారు.


Comments