జిల్లాలో పకడ్బందీగా రీసర్వే

 జిల్లాలో పకడ్బందీగా రీసర్వే*


డా.వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద జిల్లాలో 461 గ్రామాల్లో 333 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి*


జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), డిసెంబర్ 29 (ప్రజా అమరావతి);


డా.వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద జిల్లాలో 461 గ్రామాల్లో 333 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ వివరించారు.

*గురువారం విజయవాడ సిసిఎల్ఏ కార్యాలయం నుండి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం, రీసర్వే, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ చేతన్, డిఆర్ఓ  కొండయ్య, సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకంలో భాగంగా జిల్లాలో రీ సర్వే పనులు త్వరితగతిన చేపట్టేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 26 గ్రామాల్లో 7 గ్రామాలకు సంబంధించి ల్యాండ్ పార్శిల్ మ్యాప్ (ఎల్పిఎం) ప్రింటింగ్ కూడా రావడం జరిగిందని, మిగిలిన గ్రామాల్లో ప్రింటింగ్ ప్రక్రియ జరుగుతోందన్నారు. అలాగే జిల్లాలో 24 గ్రామాలకు విలేజ్ మ్యాప్ లు కూడా రావడం జరిగిందని తెలిపారు. గ్రౌండ్ టు థింగ్ కు సంబంధించి 4 గ్రామాల్లో ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన గ్రామాల్లో గ్రౌండ్ టు థింగ్ వేగంగా చేపడతామన్నారు. రీ సర్వే కింద ఎంపిక చేసిన గ్రామాల్లో గ్రౌండ్ టు థింగ్ అనంతరం గ్రౌండ్ వ్యాలిడేషన్ ప్రక్రియను కూడా త్వరితగతిన చేపట్టడం జరుగుతుందన్నారు. ఆయా గ్రామాల్లో గ్రౌండ్ టు థింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్ తదితర అన్ని ప్రక్రియలను జనవరి 15వ తేదీ లోపు పూర్తి చేసేందుకు అన్ని విధాలా చర్యలు చేపడతామని తెలియజేశారు. రీ సర్వేపై ఇప్పటికే జిల్లా, మండల, క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగిందని, అందులో రీ సర్వేపై అన్ని రకాల అంశాలను కులంకుశంగా తెలియజేశామని, రీసర్వేను వేగవంతంగా చేపడతామని  వివరించారు ఈ కార్యక్రమంలో   సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు



Comments