రాష్ట్ర ముఖ్యమంత్రికి... ఘన స్వాగతం !*రాష్ట్ర ముఖ్యమంత్రికి... ఘన స్వాగతం !*కడప, డిసెంబర్ 02 (ప్రజా అమరావతి): జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా   శుక్రవారం ఉదయం కడప విమానాశ్రయం చేరుకున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి ఘన స్వాగతం లభించింది.  


ఈ నెల 2, 3 తేదీలలో లింగాల మండలం పార్నపల్లి గ్రామంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సి.బి.ఆర్.) వద్ద పలు ప్రారంభోత్సవం కార్యక్రమాలకు, పులివెందుల లో వివాహ  కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం.. శుక్రవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో బయలు దేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్యాహ్నం 12.00 గంటలకు కడప విమానాశ్రయం చేరుకున్నారు. 


ఈ సందర్భంగా.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, డిఐజి యస్. సెంతిల్ కుమార్, నగరపాలక సంస్థ కార్పోరేషన్ కమీషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ లు ముఖ్యమంత్రికి.. పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు.


వీరితో పాటు ఎమ్మెల్సీలు  డి సి గోవింద రెడ్డి, జెడ్పి చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి,    మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి   బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, శాసన మండలి ప్రభుత్వ విప్ వెన్నపూస గోపాల్ రెడ్డి, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు  ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి, తదితరులు ముఖ్యమంత్రికి  స్వాగతం పలికిన వారిలో  వున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆప్యాయంగా అందరిని పేరుపేరున  పలకరించారు.


అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్యాహ్నం 12.20 గంటల కు హెలికాప్టర్లో లింగాల మండలం పార్న పల్లి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సి.బి.ఆర్.) కి బయలు దేరి వెళ్లారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తోపాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్. బి. అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు

ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు వెళ్లారు.


ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి,డిఎస్పీ వెంకట శివా రెడ్డి, ఎయిర్ పోర్ట్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.Comments