టిటిడి ఈఓ(ఎఫ్ఎసి)గా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరణ

 


*టిటిడి ఈఓ(ఎఫ్ఎసి)గా అనిల్ కుమార్ సింఘాల్  బాధ్యతలు  స్వీకరణ


*


తిరుమల,డిసెంబర్23 (ప్రజా అమరావతి): టిటిడి ఈఓ(ఎఫ్ఎసి)గా అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం జరిగింది.


అనంతరం బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. అదనపు ఈఓ(ఎఫ్ఎసి) వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. 


ఈ సందర్భంగా అదనపు ఈఓ(ఎఫ్ఎసి) వీరబ్రహ్మం, జెఈఓ శ్రీమతి సదా భార్గవి కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని  అందించారు.


ఈ కార్యక్రమంలో సివిఎస్వో నరసింహ కిషోర్, డెప్యూటీ ఈఓలు శ్రీమతి కస్తూరి బాయి, రమేష్ బాబు, హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.      


Comments