రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను అన్ని విధాల ఆదుకుంటుంది

 


నెల్లూరు, డిసెంబర్ 3 (ప్రజా అమరావతి);


రాష్ట్ర ప్రభుత్వం  దివ్యాంగులను అన్ని విధాల ఆదుకుంటుంద


ని, వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమంలో అందించాలని ఆలోచనలతో పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 


 శనివారం సాయంత్రం నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వృద్దులు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా జరిగింది.


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.



ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ తొలుత అందరికీ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ అభినందనలు తెలిపారు. దివ్యాంగుల్లో ఉన్న ఏకాగ్రత మరెవరికి ఉండదని ప్రశంసించారు. దివ్యాంగుల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తుంటారని అది ఎందుకు ఉపయోగపడదన్నారు.  దివ్యాంగులకు అండగా నిలిచి  వారిలో ధైర్యాన్ని నింపడంతో పాటు వారి దైనందిన జీవితంలో సుఖ సంతోషాలతో జీవించే విధంగా శిక్షణ ఇవ్వడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం చేస్తుందన్నారు.


ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ రంగంలో కూడా దివ్యాంగులకు రిజర్వేషన్  కల్పించేందుకు ప్రయత్నం  చేస్తామన్నారు.



 గతంలో విభిన్న ప్రతిభావంతులకు 80 శాతం వికలత్వం ఉన్నవారికి పింఛను ఇచ్చేవారని చెప్పారు.


నేడు వికలత్వశాతంతో సంబంధం లేకుండా అంగవైకల్యం కలిగిన వారందరికీ మూడు వేల రూపాయలు పించను విడుదల చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు.


పింఛను కోసం కార్యాలయం చుట్టూ తిరగకుండా క్యూలో నిలవకుండా ఇంటి వద్దకే వృద్దులతోపాటు ప్రతినెలా ఒకటో తేదీన టంచనుగా పించనును వాలంటీర్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గ్రామాల్లో పర్యటించినప్పుడు ఎవరైనా పించను కావాలంటే వెంటనే వారికి సదరం ధ్రువీకరణ పత్రం ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.


సంవత్సరానికి రెండుసార్లు పింఛను ఇచ్చే కార్యక్రమం జరుగుతోందన్నారు.


అవసరమైన దివ్యాంగులకు ఆరోగ్య శ్రీ పథకం కింద ఎన్ని లక్షలైనా సరే  వైద్య చికిత్సలు అందిస్తున్నామన్నారు.


అలాగే అవసరమైన దివ్యాంగులకు కావలసిన పరికరాలు, వినికిడి యంత్రాలు, మొబైల్ ఫోన్లు, చేతి కర్రలు, ఊత కర్రలు అందించడంతోపాటు వారికి ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.


పూర్వపు ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారి  చొరవతో వెంకటాచలం మండలంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాంపోజిట్ ప్రాంతీయ కేంద్రం విశిష్టమైన సేవలు అందిస్తోందన్నారు.


ప్రజల్లో ఇంకా మార్పు రావాల్సి ఉందని విదేశాలలో  దివ్యాంగుల కోసం కోసం స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని దివ్యాంగులకు కేటాయించిన సౌకర్యాలను వారికి దక్కే విధంగా ప్రజల్లో మార్పు రావాలన్నారు.


అంగవైకల్యంతో ఉన్న వారిని ఓపికతో అన్ని విధాల ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 


అవయవలోపంతో పుట్టిన బిడ్డలను ఎంతో ఆప్యాయంగా చూస్తున్న తల్లిదండ్రుల ఓర్పు, సహనాన్ని  మెచ్చుకోవాల్సింది ఉందన్నారు.


తనకు విజయవాడలో ప్రభుత్వ కార్యక్రమాలు ఎన్ని ఉన్నప్పటికీ దివ్యాంగుల దినోత్సవం లో పాల్గొనాలని ఆత్మసంతృప్తితో వచ్చానన్నారు.


ప్రతి విషయంలో దివ్యాంగులకు అధికార యంత్రాంగం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.


దివ్యాంగుల సంక్షేమం కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సేవ సంస్థలకు ధన్యవాదాలు  తెలుపుతున్నానన్నారు. 



జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ

 అంతర్జాతీయంగా విభిన్న ప్రతిభావంతులను గుర్తించడం వారిలో స్ఫూర్తి నింపడం వారిలో దాగివున్న విభిన్నమైన ప్రతిభలను వెలికి తీయడం స్ఫూర్తి నింపడం చేయూతనివ్వడం జరుగుతుందన్నారు.


వృద్ధులు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో బ్యాక్ లాగ్ ఖాళీలను ప్రత్యేక కార్యక్రమం ద్వారా చేపట్టి భర్తీ చేయడం జరుగుతుందన్నారు 


జిల్లాలో 43 మంది దివ్యాంగులకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. దివ్యాంగుల శాఖ బడ్జెట్ తో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఎన్జీవోలు, సిఎస్ఆర్  నిధులను కూడా అదనంగా సమకూర్చి పలు వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన కృత్రిమ అవయవాలు, వివిధ రకాల వినికిడి యంత్రాలు, పరికరాలను అందించడం జరుగుతుందన్నారు.


ప్రతినెలా ఒకటో తేదీన 3వేల రూపాయల పింఛన్ ను సచివాలయ వ్యవస్థ ద్వారా దివ్యాంగుల ఇంటి వద్దకే నేరుగా అందించడం జరుగుతుందన్నారు

 కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి వద్దకే పించను చేరవేయడం దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరమన్నారు.


జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా వైద్య శిబిరాలను నిర్వహించి ఎప్పటికప్పుడు శస్త్ర చికిత్సలు చేసి దివ్యాంగులకు అవసరమైన అవయవాలను అమర్చడం ద్వారా

జిల్లాలో శాశ్వత అంగవైకల్యం రాకుండా నివారించగలిగామన్నారు.


పిల్లల్లో ముందస్తుగా లోపాలను  గుర్తించేందుకు ఒక ప్రత్యేకమైన కేంద్రాన్ని నిర్వహిస్తున్నామని ఇక్కడ డాక్టర్లు ప్రత్యేక నిపుణులతో పాటు ఆడియో మెటాలజిస్టు, ఫిజియోథెరపిస్టు,  స్పీచ్ థెరపిస్టులతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఒక బృందం ఏర్పాటు చేయబడి ఉందన్నారు.


జిల్లాలో దివ్యాంగుల కోసం బ్రిడ్జి స్కూలు, పూర్వపు ఉపరాష్ట్రపతి  శ్రీ వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి చొరవతో వెంకటాచలం మండలంలో ని కాంపోజిట్ ప్రాంతీయ కేంద్రం దివ్యాంగులకు విశేష సేవలు అందిస్తోందన్నారు. 


జిల్లాలో  దివ్యాంగులు ఎవరూ కూడా వెనకబడి ఉండకుండా సమాన

అవకాశాలు పొందేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.


సర్వ శిక్ష పథకం కింద ప్రత్యేక అవసరాలను, ఉపకార వేతనాలను, రవాణా, బ్రిడ్జి స్కూల్ నిర్వహణ తోపాటు పౌష్టికాహారాన్ని, మంచి విద్యను కూడా అందిస్తున్నామన్నారు.



ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ తో కలిసి 43 మంది దివ్యాంగులకు ఉద్యోగ నియామక పత్రాలు, లాప్టాప్ లు, మూడు చక్రాల మోటరైజడ్ స్కూటీలు పంపిణీ చేశారు.



ఈ కార్యక్రమంలో వృద్ధులు విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు శ్రీమతి నాగరాజకుమారి, కాంపోజిట్ ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ రాజా మణిపాల్, డిఆర్డిఏ పిడి శ్రీ సాంబశివారెడ్డి, జడ్పీ సీఈవో శ్రీ చిరంజీవి, బీసీ సంక్షేమ అధికారి శ్రీ వెంకటయ్య, మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీమతి కనకదుర్గ భవాని, సర్వ శిక్ష ఏపీసి శ్రీమతి ఉషారాణి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జి శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పలువురు దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు,  వివిధ దివ్యాంగ సంఘాల నాయకులు దివ్యాంగుల సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Comments