ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. వైసీపీ ఇంటికెళ్లడం ఖాయం: చంద్రబాబు


 *ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. వైసీపీ ఇంటికెళ్లడం ఖాయం: చంద్రబాబు*


ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా పొందూరులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలిసి రోడ్​షోలో పాల్గొన్నారు. పొందూరు చేనేత కార్మికులకు అండగా ఉంటామని చంద్రబాబు హామి ఇచ్చారు.


 రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్‌ సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా పొందూరు రోడ్​షోలా ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారం శాశ్వతం కాదని.. వైకాపా నాయకులు దాన్ని గుర్తించాలని వెల్లడించారు. మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పొందూరులో చంద్రబాబు రోడ్​షో నిర్వహించారు.


ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమని తెలిపారు. చెత్త మీద పన్ను వేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని చంద్రబాబు ఎద్దెవా చేశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగినట్లు కేంద్రం చెబుతోందని బాబు పేర్కొన్నారు. ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేశారా? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. పొందూరు చేనేత కార్మికులకు తాము అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.ఉత్తరాంధ్రలో మూడు రోజుల పర్యటన: ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజయవాడ నుంచి విశాఖకు విమానంలో చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గన విజయనగరం బయల్దేరారు. చంద్రబాబుకు తెదేపా నేతలు గజమాలలతో ఘనస్వాగతం పలికారు. ఇదేం కర్మ రాష్ట్రానికి పేరుతో మూడు రోజులపాటు రాజాం, బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.

Comments