ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి

 ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి*


*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*

 

పుట్టపర్తి. డిసెంబర్ 30 (ప్రజా అమరావతి);


జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.  శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని  స్పందన  విసిహాలులోని జిల్లా కలెక్టర్  అధ్యక్షతన జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ నిర్వహించారు.* ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్, ఆర్టీవో కరుణ సాగర్ రెడ్డి, జాతీయ రహదారి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్  ఇంజనీర్ సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు


ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారుల్లో ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు జరిగే చోట స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న బ్లాక్ స్పాట్ లను గుర్తించి వాటిని సరి చేసేలా చూడాలన్నారు.జిల్లాలో పలుచోట్ల పాడైపోయిన రహదారులకు చేపట్టాల్సిన మరమ్మతు పనులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజల ప్రాణాలు ఎంతో విలువైనవని, వాటిని కాపాడుకోవాలని, ప్రమాదాలు జరిగిన వెంటనే గాయపడిన వారిని రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. రహదారులపై బ్రేక్డౌన్ అయిన వాహనాలను పెట్రోలింగ్ చేసే అధికారులు ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. ఎక్కువ ప్రమాదాలు జరగకుండా అవసరమైన జాగ్రత్త చర్యలు ఎప్పటికప్పుడు చేపడుతూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వివిధ పాఠశాలల్లో స్కూల్ బస్సులు తనిఖీలు చేయాలని అన్ని స్కూలు బస్సులకు  డోర్ తలుపులు  ఉండే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎక్కడెక్కడ ప్రమాదాల్లో జరుగుతున్నాయో ప్రదేశాలను గుర్తించాలని. ప్రమాదాల నివారణకు   జిల్లా పంచాయతీ అధికారుల  ఆధ్వర్యంలో  ఈ ఓ ఆర్ డి  పర్యవేక్షణలో అవగాహన కార్యక్రమాలు  నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.  చెరువుల మలుపుల వద్ద ప్రమాదక హెచ్చరికలు  సంబంధించిన  సూచిక బోర్డులను  ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షాలకు  పాడైపోయిన  రహదాలకు  తక్షణమే  మరమ్మత పనులు జనవరి మాసంలోపు పూర్తిచేయాలని ఎస్ సి పి ఆర్ నుఆదేశించారు.


ఈ సమావేశంలో  హిందూపురం, కదిరి ఎంవిఐలు రమణ, వరప్రసాద్,  DMHO  కృష్ణారెడ్డి,Dcho  తిప్పేంద్ర నాయక్,  డిఇఓ మీనాక్షి,   ఎస్ సి పి ఆర్ గోపాల్ రెడ్డి,ఇతర శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments