పాలకొల్లు. డిసెంబరు.20 (ప్రజా అమరావతి);
శ్రీ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును రాష్ట్ర ముఖ్యమంత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరీ ఎం. సమీర్ శర్మ సందర్శించారు ...
మంగళవారం పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో ఆశ్రమ హాస్పిటల్ ,బీవీ రాజు కళాశాల ల సహకారంతో శ్రీ రాఘవేంద్రర చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి తో కలిసి ఆయన ప్రారంభించారు. వైద్య శిబిరంలో వివిధ వైద్య సేవల గురించి అడిగి తెలుసుకుని వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ట్రస్ట్ వారు ఏర్పాటు చేయనున్న నిర్మాణంలో ఉన్న ఆసుపత్రికి భవనం ఆయన పరిశీలించారు. వైద్య శిబిరంలో చికిత్స చేయించుకునేందుకు వచ్చిన ప్రజలతో ఆయన మాట్లాడి వారి వ్యాధులు క్షేమాలను ఎం. సమీర్ శర్మ అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు శ్రీమతి పి. ప్రశాంతి , నరసాపురం సబ్ కలెక్టర్ ఎం సూర్య తేజ , శ్రీ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ నుండి నిమ్మల రామారావు , ఇతర సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment