సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డిని కలిసిన రాష్ట్ర సమాచార కమీషనర్లు.

 సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డిని కలిసిన రాష్ట్ర సమాచార కమీషనర్లు.
అమరావతి,6 డిసెంబరు (ప్రజా అమరావతి): అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకులో    మంగళవారం రాష్ట్ర సమాచార కమీషనర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.సిఎస్ ను కలిసిన వారిలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ ఆర్ యు.బాషా, కమీషనర్లు బివి.రమణ కుమార్,కట్టా జనార్దనరావు, ఐలాపురం రాజా,రేపాల శ్రీనివాసరావు,యు.హరి ప్రసాద్ రెడ్డి,కాకర్ల చెన్నారెడ్డి, పి.శామ్యూల్ జొనాతన్, సమాచార కమీషన్ కార్యదర్శి డా.వి.సాంబశివ రాజు పాల్గొన్నారు.Comments