నేడు ఎన్నికల రోల్ అబ్జర్వర్ రాక*నేడు ఎన్నికల రోల్ అబ్జర్వర్ రాక


*


పార్వతీపురం, డిసెంబర్ 19 (ప్రజా అమరావతి): ఎన్నికల రోల్ అబ్జర్వర్ ఏ. బాబు జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు. రోల్ అబ్జర్వర్ మంగళ వారం మధ్యాహ్నం 12 గంటల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ఓటర్ నమోదు అధికారులు, సహాయ ఓటర్ నమోదు అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు తదితరులతో సమావేశం నిర్వహిస్తారని, అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంబంధిత ప్రతినిధులు పాల్గొనాలని ఆయన కోరారు.

Comments