గుంటూరు రమేష్ హాస్పిటల్స్ వారి ఉచిత మెగా వైద్య శిబిరం

 గుంటూరు రమేష్ హాస్పిటల్స్ వారి ఉచిత మెగా వైద్య శిబిరంగుంటూరు (ప్రజా అమరావతి);

స్థానిక చైత్ర సెంటర్లో గల ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 12 మరియు 13 స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రమేష్ హాస్పిటల్స్ వారు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమం నందు రమేష్ హాస్పటల్ వైద్య బృందం వివిధ రకాలైన రోగ నిద్దారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది, డాక్టర్ల బృందం చూసి వారికి మందులు ఇవ్వడం జరిగింది.

డాక్టర్ మమతా మాట్లాడుతూ రమేష్ హాస్పిటల్స్ నందు "ఆరోగ్య భాగ్యం" అనే పథకం ద్వారా వైద్య శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి డాక్టర్ గారు సూచించిన వైద్య పరీక్షలపై 25% రాయితీలతో అందించడం జరుగుతుంది అని చెప్పారు అలాగే ఈ ఆరోగ్య భాగ్యం పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, గుంటూరు నగర డిప్యూటీ మేయర్లు సాజిలా మరియు డైమండ్ బాబు, డొక్కా మాణిక్య వరప్రసాద్, 12 వ వార్డు కార్పొరేటర్ చిస్టి, నూరి ఫాతిమా రమేష్ హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమత పాల్గొన్నారు.

ఈ వైద్య శిబిరం నందు సుమారు 500 మందికి పైగా పరీక్షలు నిర్వహించడం జరిగింది.

Comments