మత్స్యకార కుటుంబాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి అండగా వుంటున్నది

నెల్లూరు (ప్రజా అమరావతి);మత్స్యకార కుటుంబాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి అండగా వుంటున్నద


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 


శనివారం ఉదయం మీనోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన  పధకం క్రింద  సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని  వెంకటాచలం మండలం సర్వేపల్లి రిజర్వాయర్ లో మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి   చేప పిల్లలను వదలడం జరిగింది.  ఈ సంధర్భంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన  పధకం క్రింద సర్వేపల్లి రిజర్వాయర్లో ఈ రోజు 3 లక్షల చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు. ఈ పధకం క్రింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ఖర్చు చేయడం జరుగు తుందన్నారు. మత్స్య కార కుటుంబాలు, మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్న వారికి అండగా నిలవడం,  సమాజంలోని ప్రజలకు మంచి పోషక విలువలు కలిగిన  ఆహారాన్ని అందించేందుకు  ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగిందన్నారు. సర్వేపల్లి రిజర్వాయర్ పరిధిలోని 16 గ్రామాల్లోని 522 మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి కలుగుతుందని మంత్రి వివరించారు. మత్స్యకార కుటుంబాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి అండగా వుంటున్నదని,  గతంలో 6 రూపాయలు వున్న డీజిల్  సబ్సిడీని  9 రూపాయలకు పెంచడం జరిగిదన్నారు. చేపల వేట నిషేధిత సమయంలో మత్స్య కారుల జీవనోపాధికి గతంలో 4 వేల రూపాయలు ఇస్తుండగా, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకార భరోసా క్రింద క్రమం తప్పకుండా  ప్రతి సంవత్సరం 10 వేల రూపాయలు ఇవ్వడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు. వయోపరిమితిని సడలించి మత్స్య కారులకు పింఛన్ కూడా ఇవ్వడం జరుగుచున్నదన్నారు.  2023 జనవరి నుండి  రూ.2500/- లు వున్న పింఛన్ ను రూ. 2750/-లకు  పెంచుతూ పింఛన్ ను ఇవ్వడం జరుగుతుందని,  అర్హత వున్న ప్రతి కుటుంబానికి పింఛన్ ఇవ్వడం జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.  రానున్న రోజుల్లో మత్స్యకార కుటుంబాలకు  అండగా వుంటూ, వారి అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

ఆఫ్కాఫ్ ఛైర్మన్ శ్రీ కొండూరు అనిల్ బాబు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ప్రపంచ బ్యాంకు నిధులతో  జిల్లాలోని అన్నీ చెరువుల్లో  చేప పిల్లలను వదలి మత్స్య కార కుటుంబాలను ఆదుకోవడంతో పాటు మత్స్య కారుల అబివృద్దికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి మత్స్యకార కుటుంబం సద్వినియోగం చేకునేలా చర్యలు తీసుకోవడం  జరుగుతుందన్నారు. 


ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ నాగేశ్వర రావు,  తహశీల్దార్ శ్రీ నాగరాజు, ఎంపిడిఓ శ్రీమతి సుస్మిత,  మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

Comments