ప్రజలకు ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం నెరవేర్చడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుంది


నెల్లూరు, డిసెంబర్ 7  (ప్రజా అమరావతి): ముత్తుకూరు మండలవాసులకు చెప్పిన మాట ప్రకారం నాన్ ఫిషర్ మాన్ ప్యాకేజీని అందించామని, ప్రజలకు ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం నెరవేర్చడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుంద


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 


బుధవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం మామిడిపూడి గ్రామంలో  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎస్సీ కాలనీలో పర్యటించిన  మంత్రికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.   ప్రతి ఇంటికి వెళ్లిన మంత్రి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి అందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేసి, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరాతీశారు. 


తొలుత గ్రామంలోని జగనన్న లే అవుట్లో నిర్మించిన ఇంటిని మంత్రి ప్రారంభించి, ప్రభుత్వ సహకారంతో సొంతింటి కలను సాకారం చేసుకున్న కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. 


అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ మామిడిపూడి గ్రామంలో తనకు అపూర్వ స్వాగతం పలికి అక్కున చేర్చుకున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నామని, సొంత స్థలాల్లో కూడా ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి హయాంలో ముత్తుకూరువాసులకు నాన్ ఫిషర్మెంట్ ప్యాకేజీని అందిస్తామని హామీ ఇచ్చారని, ఆయన మరణాంతరం వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్యాకేజీని కేవలం నాలుగు పంచాయతీలకు మాత్రమే అమలు చేస్తామని చెప్పి అసలు పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి ఈ ప్యాకేజ్ విషయం తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి, నాలుగు పంచాయతీలకు కాకుండా ముత్తుకూరు మండలంలోని అన్ని పంచాయితీల ప్రజలకు నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీని ఇటీవల ముత్తుకూరు మండల ప్రజల ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేశారన్నారు. ఇంకా కొంతమందికి సాంకేతిక కారణాలతో నగదు జమ కాలేదని, ప్రతిరోజు ఈ సమస్యలను పరిష్కరిస్తూ ప్రతి ఒక్కరికి నగదు అందేలా చర్యలు చేపట్టామన్నారు.  అర్హత ఒకటే ప్రామాణికంగా ఎటువంటి దళారులు, నాయకులు లేకుండా నేరుగా  సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల అభివృద్ధి, సమగ్రంగా సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. 


ఈ కార్యక్రమంలో  తాసిల్దారు మనోహర్ బాబు,  సర్పంచ్ కాకి మస్తానమ్మ, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


Comments