భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సాదర వీడ్కోలు.*భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సాదర వీడ్కోలు*తిరుపతి, డిసెంబర్ 29 (ప్రజా అమరావతి): మూడు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రేపు పాల్గొనుటకు రేణిగుంట విమానాశ్రయం నుండి సాయంత్రం 5.40 కి పయనమైన  గౌ.భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ వై చంద్రచూడ్ గారికి సాదర వీడ్కోలు లభించింది. ఈ సందర్భంగా గౌరవ సి జే ఐ గారికి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందచేసారు. 


గౌ. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఏపీ హైకోర్టు లక్ష్మణరావు,  టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, మూడవ అడిషనల్ జిల్లా జడ్జి వీర్రాజు, ప్రోటోకాల్ మేజిస్ట్రేట్ కోటేశ్వరరావు, శ్రీకాళహస్తి ఆర్డిఓ రామారావు, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు,  అడిషనల్ ఎస్పీ కులశేఖర్, ప్రోటోకాల్ సూపరింటెండెంట్ ధనుంజయ నాయుడు, జిల్లా బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దినకర్ తదితరులు గౌ. సి జే ఐ గారికి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.


Comments