విశాఖలో భూ కబ్జాలు పోవాలి...ప్రజల ఆస్తులకు భద్రత కావాలి.

 *విజయనగరంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో*


*ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి అధినేత చంద్రబాబు*


*సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగం:-*


అనేక సార్లు విజయనగరం వచ్చాను...ఇంతటి ఘన స్వాగతం ఎప్పుడూ చూడలేదు

మంత్రి బొత్స, స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల ఇక గెలిచే పరిస్థితి లేదు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిడిపిని గెలిపించాలని జనం సిద్ధమయ్యారు. 

నేను ముఖ్యమంత్రి అవ్వడం ముఖ్యం కాదు....ప్రజల భవిష్యత్ నాకు ముఖ్యం.

రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదు.

నమ్మి ఓట్లేసిన ప్రజలకు జగన్ నమ్మకద్రోహం చేశాడు.

రాష్ట్రాన్ని జగన్ తన పాలనతో తగలబెట్టాడు

వచ్చే ఎన్నికల్లో వైసిపిని చిత్తు చిత్తుగా ఓడించాలి.

ఇంటి పన్ను పెంచాడు...వృత్తి పన్ను పెంచాడు....చెత్త మీద పన్ను వేసిన చెత్త సిఎం జగన్ రెడ్డి.

మరుగుదొడ్ల మీద కూడా పన్ను వేసిన సిఎం.. ఈ జగన్ రెడ్డి

మూడున్నరేళ్లలో జగన్ ఎక్కడా తట్ట మట్టివెయ్యలేదు. ఒక్క పనీ చెయ్యలేదు.

జగన్ బటన్ నొక్కుతాడు....మొత్తం బొక్కుతాడు..ఇసుకలోనూ బొక్కుడే.

రాష్ట్రంలో అన్నింటిలో దోపిడీనే దోపిడీ...ప్రజలకు ఇసుక ఎందుకు దొరకడం లేదు.?

రాష్ట్రంలో జగన్ దోచుకుంటున్నాడు....ఇక్కడ వైసిపి ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు.

నాడు జగన్ మద్యపాన నిషేధం అన్నాడా లేదా...ఇప్పుడు దానికి కట్టుబడి ఉన్నాడా...సమాధానం చెప్పాలి.?

జగన్ ప్రజలకు ఇచ్చింది నవరత్నాలు కాదు...నవ మోసాలు.

మద్యం డబ్బులు అంతా ఎక్కడికి పోతోంది...తాడేపల్లి ప్యాలెస్ కు పోతుంది.

పేదల రక్తం తాగే జలగ జగన్ రెడ్డి.

జగన్ కు విశాఖపై ప్రేమ లేదు...అక్కడి ఆస్తులపైనే ప్రేమ

విశాఖలో రుషికొండను బోడికొండ చేశారు.

జగన్ అందరినీ మోసం చేశాడు....పాపం ఇక్కడ ఉన్న పోలీసులకు జీతాలు పడడం లేదు.

జగన్ రెడ్డి విశాఖలో కొట్టేసిన ఆస్తుల విలువ రూ.40 వేల కోట్లు.

జగన్ ఒక నియమం పెట్టుకున్నాడు....విశాఖలో భూమి ఉంటే తన దగ్గర ఉండాలి...లేదంటే తనఖాలో ఉండాలి అని పెట్టుకున్నాడు.

మద్యంపై రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చాడు...అంటే 25 ఏళ్లు మీరు మద్యం తాగాలి.

జగన్ కు భయం పుట్టాలి అంటే ఇంటికొక పసుపు జెండా ఎగరెయ్యాలి

నా పర్యటనలకు యువత పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

తమ భవిష్యత్ పై యువత ఆందోళనతో ఉన్నారు.

జాబు రావాలి అంటే బాబు రావాలి అని యువత కోరుకుంటోంది.

కియా మోటార్స్, హీరో మొటార్స్, అపోలో టైర్స్ వంటి పరిశ్రమలు తెచ్చాను. యువతకు ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున కంపెనీలు తెచ్చాను.

ఒక్క ఇండస్ట్రీ కోసం హెసిఎల్ చైర్మన్ శివ నాడార్ ను ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలికాను.

స్వయంగా నా కాన్వాయ్ లో తీసుకువెళ్లాను...ఆ కంపెనీ వల్ల ఇప్పుడు 3 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి.

విశాఖలో లులూ గ్రూప్ వెళ్లిపోయింది....అదాని డాటా సెంటర్ వెళ్లి పోయింది

ఎపికి వచ్చేదే లేదని లులూ గ్రూపు స్పష్టం చేసింది.

నాడు టెలికాం సంస్కరణలు తెచ్చి సెల్ ఫోన్ రావడానికి దోహదం చేశాను.

నాడు అంతా ఎగతాళి చేశారు..సెల్ ఫోన్ తిండి పెడుతుందా అన్నారు.

ఇప్పుడు సెల్ ఫోన్ అనేది మనిషికి సర్వం అయిపోయింది.

యువతకు ఐటి అనే ఆయుధం ఇచ్చాను....దీంతో ఆకాశమే హద్దుగా యువత ముందుకు వెళుతున్నారు.

భోగాపురం ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశాను. ఈ ప్రభుత్వం ఆ పనులు ఎందుకు పూర్తి చెయ్యలేదు.?

నాడు 5 వేల ఎకరాలు ఇచ్చి శంషాబాద్ ఎయిర్ పోర్టు తెచ్చాను...ఇక్కడ మాత్రం జగన్ ప్రభుత్వం భోగాపురం ఎయిర్ పోర్ట్ ను ఆపేసింది.

ఉత్తరాంధ్రకు చెందిన జిఎంఆర్ కు ఎయిర్ పోర్టు పనులు ఇచ్చాను.

పతంజలి గ్రూపు వెయ్యికోట్లు పెట్టుబడి పెడతాను అంటే విజయనగరంలో పెట్టాలని కోరాను. ఆ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది.

విజయనగరంలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజ్ ఇచ్చింది మన ప్రభుత్వమే.

నాడు వచ్చిన ట్రైబల్ యూనివర్సిటీని పారిపోయే పరిస్థితి తీసుకువచ్చారు

ఉత్తరాంధ్రలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, వంశధార, నాగావళి అనుసంధానం ఆగిపోయింది.

ధాన్యం బస్తాలలో కూడా ఈ ప్రభుత్వం బొక్కుడు మొదలు పెట్టింది.

జగన్ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టుపట్టించాడు. వ్యవసాయాన్ని పూర్తిగా సర్వ నాశనం చేశాడు

ఎక్కువమంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే రాష్ట్రంలో ఎపి నెంబర్ 1

విజయనగరంలో ఉన్న చెరుకు షుగర్ ఫ్యాక్టరీ పోయింది.

చెరుకు రైతులు దెబ్బతిన్నారు....జూట్ పరిశ్రమలు దెబ్బతిన్నాయి.

రాష్ట్రంలో రైతులను ఆదుకుంటా...వారికి పూర్వ వైభవం ఇస్తా.

నాడు రూ.50 వేల చొప్పున రుణమాఫీ చేశాను. ఎన్నికల సమయంలో రుణమాఫీ వాయిదాలు పడలేదు.

సిఎం జగన్ రెడ్డి వల్ల ఉత్తరాధ్రంలో ఒక్క పనైనా అయ్యిందా.....ఏమీ కాలేదు.

మన జీవితాలను నాశనం చేసిన జగన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు.

ఉత్తరాంధ్రలో తట్టమట్టి వెయ్యలేని సిఎం మూడు రాజధానాలు కడతాడా.?

రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి. మూడు రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా.?

విశాఖపట్నం ఆర్థిక రాజధాని కావాలి..ఐటి రాజధాని కావాలి, టూరిజం హబ్ కావాలి...పిల్లలకు ఉద్యోగాలు రావాలి.

విశాఖలో భూ కబ్జాలు పోవాలి...ప్రజల ఆస్తులకు భద్రత కావాలి.


బొత్స ఎక్కడున్నావ్....వచ్చి చూడు ప్రజలు ఏమంటున్నారో....ఈ ప్రాంతం ప్రజలు కూడా అమరావతి రాజధాని అంటున్నారు.

రోషం లేని ఈ బొత్స, ఈ అధర్మాన, ఈ ఎమ్మెల్యే ఎగిరెగిరి పడుతున్నారు. 

ఉత్తరాంధ్రలో ఎ2 పెత్తనం జరుగుతుంటే ఎందుకు భరించాలి.?

నాడు ఒకే కేంద్ర మంత్రి పదవి వస్తే...ఎర్రన్నాయుడు చేశాను.

అశోక్ గజపతిరాజు నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి...ప్రజలకు సేవ తప్ప రూపాయి అవినీతి చెయ్యని వ్యక్తి. 

అలాంటి అశోక్ ను కేంద్ర మంత్రిని చేశాం....కళా వెంకట్రావుకు పదవులు ఇచ్చాం.

ఇది మా సామాజిక న్యాయం.

సొంత బాబాయిని గొడ్డలి వేటుతో లేపేసి...ఇక్కడ మరో బాబాయిని పంపారు.

పెద్దిరెడ్డి, సాక్షి గుమస్తా సజ్జలకు రాష్ట్రాన్ని అప్పగించారు...ఇది సామాజిక న్యాయమా.?

ఒకే వర్గం చేస్తున్న దోపిడీ పాలన ఇది.

నిప్పు లాంటి అశోక్ గజపతి పై తప్పుడు కేసు పెడతారా.?

మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం సిబ్బందిపై కేసులు పెట్టారు...ఆశోక్ ను ఇబ్బంది పెట్టారు.

కేసులు పెట్టి ఏం పీకారు..ఇక్కడ ఉన్న బొత్స అది తప్పు అని జగన్ కు ఎందుకు చెప్పలేదు..?

రాష్ట్రంలో జగన్ అనే భూతం ఉంది.. దీన్ని బయటకు పంపాలి.

తల్లికి అన్నం పెట్టని వాడు....పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా...జగన్ తీరు కూడా అంతే.

కులం, ప్రాంత మధ్య చిచ్చు పెట్టాలని జగన్ చూశాడు...అది సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు పేదలు, ధనికులు అంటున్నాడు.

టిడిపి మద్దతు దారులు అంతా పేదలే. టిడిపి పుట్టిందే పేదరికం లేని సమాజం కోసం.

సంక్షేమం మొదలు పెట్టిందే తెలుగుదేశంపార్టీ...మేము వస్తే సంక్షేమం ఆపడం కాదు...మెరుగైన సంక్షేమం ఇస్తాం.

ఈ ప్రభుత్వం దివాళా తీసింది.. ఇప్పటికే అప్పు రూ.9 లక్షల కోట్లకు చేరింది. ఈ అప్పులు ఎవరు కట్టాలి.?

విశాఖను ఈ సిఎం గంజాయికి, డ్రగ్స్ కు రాజధాని చేశాడు.

మన పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి.

పోలీసులకు తెలివి ఉంటే ఆ గంజాయి పెట్టుకోవాలి

ఆడవాళ్లపై అత్యాచారాల్లో నెంబర్ వన్ గా ఎపి మారింది.

ఇవన్నీ చూస్తుంటే చాలా బాధేస్తోంది.

విజయనగరం జిల్లా అంతటా బొత్స కుటుంబం దోపిడీ,  కబ్జాలకు పాల్పడుతోంది.

ప్రతి పనిలో లంచమే...ప్రతి దానికి రేటు పెట్టి కమిషన్ లు వసూలు చేస్తున్నారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి పాలనే.

ఈ అవినీతి పాలన పోవాలి అంటే తెలుగుదేశం రావాలి.

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని సిఎం పదవికి రాజీనామా చెయ్యాలి.

జీతాలు అడిగిన ఉద్యోగులను బెదిరిస్తున్నాడు...కేసులు పెట్టి వేధిస్తున్నాడు.

Comments