ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

 *ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి


*


*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


కొత్తచెరువు (శ్రీ సత్యసాయి జిల్లా), డిసెంబర్ 24 (ప్రజా అమరావతి):


నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కింద జగనన్న హౌసింగ్ లేఔట్లలో చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కొత్తచెరువు మండల కేంద్రంలోని నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కింద జగనన్న హౌసింగ్ లేఔట్లలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కింద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. కొత్తచెరువు మండల కేంద్రంలో జగనన్న లేఔట్ లలో 192 ఒక చోట, 147 ఇళ్లు ఒకచోట మంజూరు కాగా, బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణం ముందుకు కదలడం లేదని, వెంటనే త్వరగా నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీడీవో, తహసీల్దార్, హౌసింగ్ జేఈలు సమావేశం నిర్వహించి హౌసింగ్ లేఔట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులందరికీ ఇల్లు కట్టుకోవాలని తెలియజేయాలన్నారు. వారం రోజుల్లోపు ఇళ్లు కట్టుకోకపోతే క్యాన్సిల్ చేయబడుతుందని వారికి తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, ఎంపీడీవో సిద్ధారెడ్డి, హౌసింగ్ జెఈ రమణారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ వెంకట్ రెడ్డి, వెలుగు నాగేంద్ర, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.Comments