రాజ్యాంగానికి విఘాతం కల్పిస్తున్నారు

               

రాజ్యాంగానికి విఘాతం కల్పిస్తున్నారు


తెనాలి (ప్రజా అమరావతి);

ప్రస్తుత నాయకులు రాజ్యాంగ మూలసూత్రాలకు విఘాతం కల్పిస్తన్నారని మాజి MLA ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు, ఆయన 18వ వార్డులో ఇదేంఖర్మ మన రాష్ట్రానికి " కార్యక్రమంలో పాల్గొని రాజ్యాంగ నిర్మాత BR  అంబేద్కర్  భారత దేశంలో విభిన్న మతాలు కులాలు జాతుల మథ్య సమన్వయంతో వారికి హక్కులు మంచి చదువు ,ఆరోగ్యం ,సమన్యాయం  కల్పించాలని రాజ్యాంగం రూపొందించారని  కాని దానిని ఆచరణ చేయవలసిన ఎన్నికైన నాయకులు రాజ్యాంజాన్ని తూట్లు పొడిచి విఘాతం కల్పిస్తున్నరన్నారు.రాజ్యాంగం అమలు చేసే గెలిచిన నాయకుల పాలన పై దేశ భవిష్యత్తు ఆథారపడి ఉంటుందని అన్నారు.


తెనాలి పట్టణ 18వ వార్డులో జరిగిన   " "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి ఈ  YCP ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ,  మద్య నిషేథం చేసి అ మహిళల కన్నీళ్ళు తుడుస్తానని మాట చెప్పి బార్లు బోర్లా తెరచి మడం తిప్పాడని మరియు స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలు,దోపిడీ పై, పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు గురించి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో మిమ్మల్ని బాధించే అంశాలు ఏవి?  అని వార్డు ప్రజలచే వారిచే డిక్లరేషన్ పూర్తి చేయించారు.


కార్యక్రమంలో 18వ వార్డు తెలుగుదేశం పార్టీ శ్రేణులు,తెనాలి నియోజకవర్గ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.Comments