*భాషను వేదికగా చేసుకుని రాజకీయాలు చేయడం సరికాదు
*
*•కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు పొందిన తెలుగు దివ్వెలకు అభినందనలు*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు*
అమరావతి, డిశంబరు 23 (ప్రజా అమరావతి): భాషను వేదికా చేసుకుని రాజకీయాలు చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అద్యక్షులు పి.విజయబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు అనే పేరుతో నేటి నుండి విజయవాడలో రెండు రోజుల పాటు మహా సభలను నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. కేవలం ప్రభుత్వ నిధులతోనే అధికార భాష మరియు మాతృభాష అయిన తెలుగును పరిరక్షించుకొందాము అనే భావన సరికాదన్నారు. ప్రతి తెలుగువాడు తన మాతృ భాష అయిన తెలుగు భాష అభివృద్దికి, పరిరక్షణకు తనవంతు సహాకారాన్ని అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అయితే “స్వభాషను రక్షించుకుందాం…స్వాభిమానం పెంచుకుందాం” అనే నినాదంతో ఈ మహా సభలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేస్తున్నారన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు అని, ఈ భాషకు సుదీర్ఝమైన ప్రాచీన చరిత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. 56 అక్షరాలతో రూపుదిద్దుకున్న తెలుగు భాష నాశనం లేని అజంత భాష అని, అటు వంటి భాషను రక్షించుకుందాం…స్వాభిమానం పెంచుకుందాం అనే నినాదంతో వీరు మహా సభలు నిర్వహించడం సరికాదన్నారు. అసలు ఇప్పుడు తెలుగు భాషకు ఏమైందని, అటు వంటి నివాదంతో ఈ తెలుగు మహా సభలను నిర్వహించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ప్రపంచంలోని అనేక భాషలు మారుతున్న సమాజానికి అనుగుణంగా ప్రపంచీకరణ నేపధ్యంలో అనేకమైన అన్యభాషా పదాలను తమలో చేర్చుకుంటా ఎంతో పరిపుష్టంగా ఆయా భాషలు ఫరిడవిల్లుతున్న నేపథ్యంలో తెలుగు భాషా కూడా అదే విధంగా పరిడవిల్లుచున్నదన్నారు. అయితే భాషను వేదికగా చేసుకుని రాజకీయాలు చేయడం సరికాదని నిర్వాహకులకు ఆయన హితవు పలికారు. దేశ విదేశాల నుండి రచయితలు, కవులు, సాహితీవేత్తలు ఈ తెలుగు రచయితల మహా సభకు తరలి వస్తున్నారని నిర్వాహకులు తెలుపుతున్నప్పటికీ రాష్ట్రంలోని పలువురు రచయితలను, కవులను, సాహితీ వేత్తలను ఈ సభలకు ఆహ్వనించకపోవడం ఎంతో శోచనీయమైన విషయం అని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమున్నత లక్ష్యంతో నిరుపేద విద్యార్థులకు ఆంగ్ల మాద్యమంలో విద్యాబోధన అందజేయాలని ఆంగ్లమాద్యమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెడితే తెలుగు భాష అంతరించిపోయినట్లా అని నిర్వాకులను ఆయన ప్రశ్నించారు. కార్పొరేట్ పాఠశాలల దోపిడీ నుండి నిరుపేద కుటుంబాలను కాపాడేందుకు ప్రభుత్వం ఇటు వంటి విప్లవాత్మక సంస్కరణలను విద్యారంగంలో అమలు పరుస్తుంటే, దాన్ని బూచిగా చూపిస్తూ ఈ ప్రభుత్వం తెలుగు భాషను కించపరుస్తుందని, స్వాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నదంటూ మోకాలుకు బోడిగుండుకు ముడిపెట్టే చందంలా ఒక విధమైన దుష్ప్రాచారానికి ఇది ఒక వేదిక మాత్రమేనని ఆయన అన్నారు. ఇవి ప్రపంచ తెలుగు మహా సభలు ఏమాత్రం కావని, భాషను వేదిగా చేసుకుని రాజకీయాలు చేసేందుకు ఇది ఒక వేదిక మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. పండితులను, కళాకారులను రాజకీయాలకు వాడుకోవడం సరైన పద్దతి కాదని నిర్వాహకులకు ఆయన హితవు పలికారు.
*ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తెలుగు భాష ఫరిడవిల్లుతున్నది….*
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తెలుగు భాషా ఎంతో ఫరిడవిల్లుతున్నదని, తెలుగు భాషకు, భాషా వికాసానికి, పరిరక్షణకు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాలను ప్రస్తుత ముఖ్యమంత్రి తీసుకోవడం జరుగుచున్నదన్నారు. తెలుగు అకాడమీని పునరుద్దడించడంతో పాటు తెలుగు భాషా సంఘాన్ని పున:నియమించారన్నారు. ఎంతో మంది రచించిన పుస్తకాలను ప్రస్తుత ప్రభుత్వం లక్షల రూపాయాల ఖర్చుతో కొనుగోలు చేస్తూ రచయితలను అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ఆదుకుంటున్నదన్నారు. రాష్ట్ర సరిహద్దులోని ప్రజలకు తెలుగు భాషపై మక్కువ పెరిగే విధంగా తెలుగు అధికార భాషా సంఘం కృషిచేస్తున్నదని, తెలుగు భాషలోని ఉత్కుష్ట్ర గ్రంధాలను అన్నింటినీ ఆంగ్ల మాద్యంలోకి తర్జుమా చేసి ఆయా గ్రంధాలను విశ్వవ్యాప్తం చేయడానికి కూడా కృషిచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
*కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు పొందిన తెలుగు దివ్వెలకు అభినందనలు….*
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ప్రముఖ తెలుగు రచయిత మధురాంతకం నరేంద్రకు మరియు రచయిత, కవి వారాల ఆనంద్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం తరపున మరియు వ్యక్తిగతంగా ఆయన అభినందలు తెలిపారు. ప్రముఖ తెలుగు రచయిత మధురాంతకం నరేంద్రకు మరియు రచయిత, కవి వారాల ఆనంద్ తో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు. తాను సంపాదకునిగా ఉన్నప్పుడు ముధురాంతకం నరేంద్ర మరియు వారి తండ్రిగారైన ప్రముఖ కథా రచయిత మధరాంతకం రాజారావు రచనలు, కథలలో అనేకం తాను ప్రచురించినట్లు తెలిపారు. కథల పోటీలకు కూడా పలు మార్లు వారిని న్యాయ నిర్ణేతలుగా పిలవడం జరిగిందన్నారు. అదే విధంగా రచయిత, కవి వారాల ఆనంద్ సాహిత్య ప్రక్రియలో భహుముఖ ప్రజ్ఞతను సాధించారని, 1990 దశకంలో అనేక రచనలు చేశారని, ముఖ్యంగా సినిమా విమర్శకులుగా మంచి ప్రతిభను చూపారని కొనియాడారు.
పాత్రికేయుల సంఘం ప్రతినిధి ఆంజనేయులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment