కలశ జ్యోతి ఉత్సవము

 కలశ జ్యోతి ఉత్సవము


:

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి):

    ఈరోజు అనగా ది.07-12-2022 (మార్గశిర పౌర్ణమి) సాయంత్రం కలశజ్యోతుల ఉత్సవములకు 

గౌరవనీయులైన విజయవాడ నగర సెంట్రల్ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు  విచ్చేయగా శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ  స్వాగతం పలికారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ , ఆలయ వైదిక కమిటీ సభ్యులు శ్రీ ఆర్. శ్రీనివాస శాస్త్రి గారి ఆధ్వర్యంలో సెంట్రల్ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు , ఆలయ కార్యనిర్వహణాధికారి   శ్రీ శృంగేరి శారదా పీఠ మహా  సంస్థాన పరిపాలితమైన సత్యనారాయణపురం లోని శ్రీ శివరామకృష్ణ క్షేత్రం  నందు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, శ్రీ అమ్మవారి రధం ఊరేగింపు ప్రారంభించడం జరిగినది.  ఊర్వశి సెంటర్, శైలజా ధియోటర్, అలంకార్ సెంటర్, ఏలూరు రోడ్, స్వర్ణ ప్యాలస్, పొలిసు కంట్రోల్ రూము, ఫ్లైఓవర్, వినాయక స్వామీ దేవస్థానము, రధం సెంటర్ మీదుగా కనకదుర్గా నగర్ నకు "జై దుర్గా జై జై దుర్గా" అను శ్రీ అమ్మవారి నామస్మరణతో కాలినడకన చేరుకుని, కనకదుర్గా నగర్ నందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రదేశం నందు భక్తులు అమ్మవారికి జ్యోతులు భక్తితో సమర్పించడము జరిగినది.

 ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని జ్యోతులు సమర్పించి, శ్రీ అమ్మవారిని దర్శించుకొనగా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది, అవాంటనీయ ఘటనలు జరగకుండా ఆలయ అధికారులు  పోలీసు శాఖ వారి సమన్వయముతో ఏర్పాట్లు చేసి కళశజ్యోతుల ఉత్సవమును విజయవంతంగా నిర్వహించడం జరిగినది.


     అనంతరం భక్తులు మహామండపం మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకొని అమ్మవారి దర్శనము చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీమతి లింగం రమాదేవి గారు, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ వార్లు,  సహాయ కార్యనిర్వహణాధికారి వార్లు, పర్యవేక్షకులు మరియు ఇతర ఆలయ సిబ్బంది, పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ మరియు ఇతర శాఖల సిబ్బంది, భవానీ మాలాధారులు, భక్తులు పాల్గొన్నారు.

Comments