పథకాలు అందక మిగిలిపోయిన లబ్ధిదారులకు కూడా మనం వారి ఖాతాల్లోకి శాచురేషన్‌ మోడ్‌లో ఇవ్వడం చూస్తుంటే వారి కళ్ళలో చాలా ఆనందం కనిపిస్తుంది.


అమరావతి (ప్రజా అమరావతి);


*అర్హులైన ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదన్న స్ధిర సంకల్పంతో...అర్హులై ఉండి పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం కూడా ఇస్తూ...రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి 2,79,065 మంది లబ్దిదారులకు రూ. 590.91 కోట్లను సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన మాట్లాడిన మంత్రి, లబ్ధిదారులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం (పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి)*


అందరికీ నమస్కారం, చాలా ఆనందంగా ఉంది, మేం మీ ఆదేశాలతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి ఆప్యాయంగా పలకరిస్తున్నాం, అర్హులైన లబ్ధిదారులు పథకాలు అందుకోవడం ఒక ఎత్తయితే, వివిధ కారణాల వల్ల పథకాలు అందక మిగిలిపోయిన లబ్ధిదారులకు కూడా మనం వారి ఖాతాల్లోకి శాచురేషన్‌ మోడ్‌లో ఇవ్వడం చూస్తుంటే వారి కళ్ళలో చాలా ఆనందం కనిపిస్తుంది.


లంచాలు ఏమైనా ఇస్తున్నారా అంటే మా జగనన్న వచ్చినప్పటి నుంచి ఆ మాటే లేదంటున్న మాట వింటున్నాం. ఏపీలోని అన్ని పల్లెలు, పట్టణాల్లో ఈ మాట వినిపిస్తుంది. ప్రతి పేదవాడు కూడా ఆనందంగా ఉన్నారంటే మీ వల్లే సాధ్యం. ప్రతి అక్కచెల్లెమ్మ కూడా మా అన్న వచ్చిన తర్వాత జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా మా ఇంటి దగ్గరే నీళ్ళు తీసుకుంటున్నాం అంటే ఆనందంగా ఉంది. ధ్యాంక్యూ అన్నా.


*వెలమల నాగమణి, లబ్ధిదారు, పెద్ద తాడివాడ, విజయనగరం జిల్లా*


జగనన్న నమస్తే, అన్నా నాకు అమ్మ ఒడి మొదటి రెండు విడతల డబ్బులు పడ్డాయి, మూడో విడత డబ్బులు పడలేదు, వాలంటీర్‌ను కలిశాను, బ్యాంక్‌ అకౌంట్‌ లింక్‌ కాని కారణంగా పడలేదని చెప్పారు. వెంటనే మా వాలంటీర్‌ సచివాలయానికి తీసుకెళ్ళి లింక్‌ చేయించింది. మీరు మాట ఇచ్చారంటే తప్పరని మేం ఎదురుచూశాం, మళ్ళీ లిస్ట్‌ లో నాపేరు రాగానే చాలా సంతోషంగా ఉంది, మీరు ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదలకు చాలా ఉపయోగంగా ఉన్నాయి, సచివాలయ వ్యవస్ధలో ఏ పనులైనా జరిగిపోతున్నాయి, పెన్షన్స్‌ కోసం పడిగాపులు ఉండేవి, కానీ ఇప్పుడు అన్నీ ఇంటి ముందుకే వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. తాగునీటి కోసం చాలాదూరం వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు ఇంటిఇంటికి అందుతున్నాయి, అమ్మ ఒడి మాలాంటి పేదలు చదివించడానికి చాలా ఉపయోగంగా ఉంది. పిల్లలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, గతంలో సిటీలో డెవలప్‌మెంట్‌ ఉండేది కానీ ఇప్పుడు పల్లెటూర్లలో కూడా అభివృద్ది జరుగుతుంది, మాలాంటి పేదలకు సొంత ఇల్లు కలగా ఉండేది కానీ ఇప్పుడు మీరు ఆ కలను నెరవేర్చారు. ధన్యవాదాలు అన్నా, ప్రతి ఇంటిలో మిమ్మల్ని ఒక అన్నలా, ఒక తమ్ముడిలా, ఒక కొడుకులా భావిస్తున్నారు. ప్రజలంతా మీరే సీఎంగా రావాలని కోరుకుంటున్నారు. మీరు సీఎంగా రావడం మాకు వరం. ధన్యవాదాలు అన్నా.


*దేవిశెట్టి శారదాదేవి, లబ్ధిదారు, కొవ్వూరు, కాకినాడ రూరల్‌ మండలం*


నమస్తే జగనన్నా, నాకు మొదటి ఏడాది కాపు నేస్తం వచ్చింది, మాకు ఎప్పుడూ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి జరగలేదు. మీరు మహిళలను గుర్తించి, మా కాపులకు కాపునేస్తం ఇచ్చారు, కానీ రెండోసారి రాలేదు ఎందుకు రాలేదని వాలంటీర్‌ను అడిగితే కరెంట్‌ బిల్‌ ఎక్కువ రావడంతో ఆగిపోయిందన్నారు, కానీ సాంకేతిక తప్పిదం వల్ల జరిగిందని మళ్ళీ రీసర్వేలో మీకు వస్తాయి టెన్షన్‌ పడకండి అన్నారు, నిన్న కాల్‌ చేసి మీకు కాపు నేస్తం వచ్చింది అనగానే చాలా సంతోషం వేసింది. మా కాపు మహిళలు రూపాయి అడగాలంటే మనసు ఒప్పుకోక, ఇంట్లోనే ఉండేవారిమి. మా కల మీరు నెరవేర్చారు, మాకు రాకపోతే చాలా బాధపడ్డాం కానీ జగనన్న ఇచ్చిన మాట తప్పరని మేం అనుకున్నాం, ఇవాళ గర్వంగా చెప్పుకున్నాం జగనన్న మాకు డబ్బులు వేస్తున్నారని...మీరు ప్రతి ఇంటికి చాలా సాయం చేస్తున్నారు, మా నాన్నగారికి ఫించన్‌ వస్తుంది, మా నాన్న జగన్‌ నాకు పెద్ద కొడుకు, ప్రతి నెలా తెల్లవారగానే డబ్బులు పంపుతున్నారంటున్నారు. డ్వాక్రా రుణం వచ్చింది, ఆసరా వచ్చింది, మా కాపులను మీరు గుర్తించారు. చాలా సంతోషం. ఇంటికి వచ్చి రేషన్‌ ఇస్తున్నారు.మీ పరిపాలన చాలా బావుంది, మళ్ళీ మళ్ళీ మీరు సీఎంగా రావాలి, వాలంటీర్‌కు ఒక ఫోన్‌ చేయగానే ఏ సమస్యకు అయినా పరిష్కారం దొరుకుతుంది. గతంలో ప్రభుత్వ ఆఫీస్‌ చుట్టూ కాళ్ళరిగేలా తిరిగేవాళ్ళం. కులమత భేదం లేకుండా అందరినీ సమానంగా చూస్తున్నారు. మళ్ళీ మళ్ళీ మీరు సీఎంగా రావాలి, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Comments